శరీరం సుఖాసనం,
ప్రాణమునకు అనులోమ విలోమ సమప్రాణాయము,
మనసుకి రెండు అక్షరాల మంత్రం,
బుద్ధి భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ఉంచటం.
ఐదవది... చిత్త వృత్తి నిరోధం కొరకు భావరూపమైనటువంటి ఈశ్వర దర్శనం.
ఈ ఐదు లక్షణాలని సాధనలని ఏకకాలంలో చేస్తే ఒక సూత్రం మీదికి వచ్చేస్తాయి.
శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తం.
ఆరవది అహంకారమునకు నేను అనే లక్షణం ఉంది. ఆ నేను అనే లక్షణాన్ని భావరూప ఈశ్వర దర్శనంతో ఐక్యత చెందించడం.
ఏ దర్శనం అయితే నువ్వు పొందుతున్నావో... అది సద్గురువు గాని, ఈశ్వరుడు గాని, ఇష్టదైవం కానీ.. ఆ దర్శనంతో ఏకత్వానుభూతిని పొందడం.
పొందితే అంతఃకరణం జ్ఞాతలో కలిసిపోతుంది.
మీ ఊపిరి మీకే పెద్ద శబ్దంతో వినబడుతూ ఉన్నటువంటి నిశ్శబ్దం.
క్రమేపి ప్రాణ వేగం తగ్గిపోతూ వస్తుంది.
శరీర, ప్రాణ, మనో, బుద్ధి, చిత్త, అహంకారముల యందు ప్రసరిస్తూ ఉన్న చైతన్యం విరమించడం మొదలుపెడుతుంది.
కదలగలిగి సశక్త్యమై ఉన్నటువంటి సర్వేంద్రియములు శక్తి వినిమయం నిరోధించబడి పూర్ణమైనటువంటి శక్తిని పొందుతూ ఉన్నాయి.
నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ ఫాల భాగంలో ప్రత్యక్షమవుతుంది.
నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ ఫాల భాగంలో ప్రత్యక్షమవుతుంది.
ఆ ప్రకాశమే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు.
ఆ ప్రకాశమునకు ఆధార భూతమైన బిందు స్థానము సహస్రారము.
క్రమముగా ద్వాదశాంతమైనటువంటి భ్రూమధ్యము నుంచి బ్రహ్మ రంధ్రము దిశగా సూక్ష్మ చలనము స్థిరమై, శాంతమై, తేజో దీపకమై, శిరోభాగం అంతయు, దేహమంతయు వ్యాపకమై, ప్రకాశమునే శరీరముగా ధరించి ఉన్నావు.
సదా ఈ తేజస్శరీర ధారణచే నీ సర్వేంద్రియములు చైతన్యవంతములై స్వాత్మ ప్రకాశమైన సహస్రార స్థానమున నిలకడ చెందుచున్నవి.
ఇట్టి స్వప్రకాశ తేజో మండలమునందు స్థూల, సూక్ష్మ, కారణ, స్పర్శలు విలీనం కాగా, బిందు మధ్యమునందు మాత్రమే నిలకడ చెందుటయే సమాధి నిష్ఠ.
ఈ స్థానము నందు నిలకడ చెంది, సాక్షివై, అభిమాన త్యాగము చేసి, సర్వ వ్యవహారమును, కర్మకు అతీతమై, లీలా మాత్రముగా దేహాత్మ భావం నుంచి విడివడి అంతరాత్మ యందు స్థితుడవు అగుచున్నావు.
ఈ ప్రాణ నిరోధము, మంత్రానుష్టానము, దృష్టియందు నిలకడ, ఈశ్వర దర్శనం, స్వప్రకాశ సాక్షాత్కార హేతువై, జ్ఞానోదయం అగుచున్నది.
ఎచట చూసినా, ఏ ఇంద్రియ జ్ఞానమైనా, ప్రకాశ రూపముగానే గుర్తించబడుచున్నది.
అనేకముగా నున్న జగత్తు అంతా ఈ ప్రకాశమందే విలయము చెందుచున్నది.
నేను కేవల ప్రకాశ రూపుడను.
తేజో రూపముగానున్న సృష్టి యందు అంతటా వ్యాపకమై ఉన్నాను.
సర్వ సృష్టి తేజో రూపముగా నా యందు అంశీభూతమై ఉన్నది.
నేను కేవల ప్రకాశ రూపుడను.
****
ఎరుకతో నిద్రపోవడం అంటే ఇది.
విద్యాసాగర్ స్వామి వారు🙏
No comments:
Post a Comment