1411. 1-5. 100223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*త్రికరణములు:*
➖➖➖✍️
*త్రికరణములు అనగా మనస్సు, వాక్కు, కర్మ అనేవి. ఈ మూడింటిలో ఎవరికైతే ‘శుద్ధి’ ఉంటుందో అదే ‘త్రికరణశుద్ధి!’ మనస్సులో ఏది ఉంటుందో, మన వాక్కులో అదే ఉండాలి. మన వాక్కులో ఏది చెప్పబడుతుందో మన కర్మలో అదే చెయ్యబడాలి. ఇదీ ‘త్రికరణ శుద్ధి!’*
*మనకు అశ్లీల సినిమాలు, పనికిరాని టీ.వి. కార్యక్రమాలు వచ్చినప్పటి నుండి ఈ త్రికరణ శుద్ధి లోపించింది. మన మనోవాక్కాయ కర్మలను బలహీనపరిచే కుట్ర జరిగిపోయింది. తాత్త్విక దృష్టి, వైరాగ్య మనస్తత్వం, నిరాడంబరత, మన మనస్సు నిండా ఉండాల్సింది పోయి బలహీన మనస్తత్వం, దుర్బలత్వం, విషయలోలత్వం మనల్ని కలుషితం చేస్తున్నాయి.*
*ఎంతసేపూ ‘అవతలి వాడి జేబులో ఉన్న రూపాయి మన జేబులోకి ఎలా వస్తుంది?’ అన్న ఆలోచన కొందరిది. ఇది ధనవ్యామోహం. వెర్రి సినిమాలు చూసి అందులోని నటీ నటుల్లా జీవించాలనుకోవడం ఇంకొందరిది. ఇది భోగ వ్యామోహం. ఎప్పుడూ ఎదుటివాడ్ని తన కన్నా తక్కువ చేయడం కోసం ఎలాంటి కుట్రలు చేయాలో ఆలోచించడం ఇంకొద్దిమంది వంతు.*
*ద్వేషభావన, ఈర్ష్య, అసూయ, ఇతరుల్ని ఏవగించుకోవడం - అనే మానసిక వ్యాధి రోజురోజుకు పెరుగుతోంది. తద్వారా సమాజం అశాంతిమయం అయిపోయింది.*
*సమాజానికి మనం చీడపురుగుల్లా మారిపోయి వికృతమైన ఆలోచలు అందించడం సబబేనా?*
*”మృత్యోర్మా అమృతంగమయా” అన్న అమృత వాక్కును వదిలిపెట్టి మృత్యుకూపంలోకి జారుకోవడం మంచిదేనా?*
*‘అమృత పుత్రోహం’ అన్న వేదవాక్కును వదిలి ‘నీవు పాపివి’ అన్న భేద వాక్కును ఆశ్రయించడం ఎంతవరకు విజ్ఞత?*
*మనిషి మనిషిపైనే యుద్ధం చేసే అధార్మికుల ఆటలకు తాళం వేసే బానిస మనస్తత్వం ఇంకెప్పుడు వదిలిపెడదాం? ఎన్నాళ్లీ అరణ్యరోదన?*
*వీటిన్నిటికీ ఒకే పరిష్కారం. వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం. ‘మళ్ళా వేదమార్గం బాట పట్టాలి’, వేదఋషుల విద్యల్ని, విజ్ఞానాన్ని, సర్వోతృష్ట జ్ఞానాన్ని ప్రపంచానికి అందిద్దాం! అదే మన కర్తవ్యం.*
*ఒకడు డబ్బు సంపాదిస్తున్నాడని ‘పులిని చూసి నక్క వాతపెట్టుకోవడం’ సరైంది కాదు! మన పరిథిలో మనకు ఏది చేతనైతే అది చెయ్యడమే విజ్ఞత.*
*త్రాగడం , తినడం అనే దుర్వ్యసనాలను సమాజంలో ఉన్నత గౌరవాలుగా ప్రకటిస్తున్న వారిని ఏ పేరుతో పిలవాలో, వారిలోని రాక్షసత్వానికి ఎలాంటి బ్రాండ్ వెయ్యాలో ‘పదాలు’ దొరకడం లేదు. మనిషిలోని ఈ రాక్షసప్రవృత్తికి కారణం ‘ఆధ్యాత్మిక లోపం!’*
*ఆధ్యాత్మికత, ధార్మికత లోపించడం వల్లనే మన సత్యసంధత, ధార్మికబుద్ధికి లోపం జరిగింది. ఎంతసేపూ సాంకేతిక, విజ్ఞాన ప్రగతి పేరుతో చెప్పబడుతున్న చదువులు విలువలు నేర్పని విద్య, సాంస్కృతిక కళాదృక్పథం లేని మనస్తత్వం ప్రధాన కారణం.*
*భారత దేశం మరిచిపోయిన వైదిక ధర్మాన్ని తాత్విక దృక్పథాన్ని మళ్లీ స్వీకరించినప్పుడే మనం పునర్వైభవాన్ని పొందగల్గుతాం.*
*అలాగే మనిషిని రాక్షస ప్రవృత్తి వైపు తీసుకెళ్తున్న మద్యమాంసాల జోరు తగ్గాల్సిన అవసరం ఉంది. వాటివల్ల కలిగే ప్రవృత్తి మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నది. అలాంటి ఆలోచనల నుండి దూరం ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం…*
*వైదిక ధర్మం: *
*ధార్మిక బుద్ధిపై అవగాహన
మనస్సును మాలిన్యపరిచేవారినుంచి వైదొలగాలి!*
*మనవంతు పాత్రగా ధార్మిక బీజాలను వ్యాప్తి చేయాలి!*
*ఉత్తమగుణాలు గల వ్యక్తులను పెంచాలి.*
*పరమాత్మను ఆధారం చేసుకోవాలి. దేశాన్ని, దైవాన్ని రెండు కళ్లల్లా భావించాలి.*
*సన్మార్గమే మన మార్గం కావాలి!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment