[11/23, 18:05] +91 97058 59828: అలవాటయిన ఆలోచనా శైలిని సవరించుకోవాలి
1వ రోజు
మున్ముందుగా మనం బలీయంగా విశ్వసించే కొన్ని ఆలోచనలను సమీక్షించుకుందాం. ఇవి ఎంతటి పొరపాటు ఆలోచనలో గుర్తించి-వాటిని మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాలో ఇక్కడే వివరించడం జరిగింది. ఈ సామాన్యమైన పొరపాట్లు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ - అంటే మీకు కూడా అన్వయించుతాయి. వాటిని అతి జాగ్రత్తగా చదవండి. పొరపాట్లు చేయగూడదనుకోవడం పొరపాటు
మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే ఇతరులు మిమ్మల్ని తక్కువగా చూస్తారని, పొరపాట్లు చేయడం. బలహీనతకు చిహ్నమని, పొరపాట్లు చేస్తుంటే మిమ్మల్ని తెలివితక్కువవారని ఇతరులు భావిస్తారని
అనుకొంటున్నారా? అందుకే ఏమైనా పొరపాట్లు చేసినా, వాటిని కప్పి పెట్టుకోవాలని చూస్తున్నారా? ఇది పూర్తిగా పొరపాటు ఆలోచనా ధోరణి అని వేరే చెప్పనవసరం లేదు.
పొరపాట్లు చేయడాన్ని సహించడమేకాదు. అవి ఎంతో అభిలషణీయం కూడా! వాటిని అంగీకరించడం ఎంతో అవసరం కూడా! మనం పొరపాట్లు చేయడం కూడా జీవితంలో వివిధ అంశాలను నేర్చుకోవడంలో ఒక భాగమే! మనం మరింతగా ముందుకెదగడానికి అవి దోహదం చేస్తాయి. ఎప్పుడూ పొరపాటు చేయగూడదనుకొనేవారు, ప్రతి పనిని ఆచి తూచి చేయవలసి వుంటుంది. ఫలితంగా వారు అనవసరంగా ఉద్రిక్తతకు, ఆందోళనకు లోనవ్వడం జరుగుతుంది. మీరు చేసే పొరపాట్లను ఇతరులు చీదరించుకోరు. అవి మానవ సహజమని గుర్తించి మీకు మరింత సన్నిహిమవుతారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పొరపాట్లు చేసినందుకు తెగవాడినా, వారిని మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. వారి మనస్సులోని అభద్రతా భయం వల్లనే, ఇలా విమర్శించ పూనుకొన్నారని మీరు గుర్తించగలిగితే చాలు.
ఇటీవల కాలంలో మీరు చేసిన పొరపాట్లను గుర్తుతెచ్చుకోండి. వాటిని కప్పిపుచ్చుకోవడా నికి బదులు, మీ సన్నిహితులకు చెప్పి నవ్వుకోండి ఇతరులకు చెప్పగూడని పొరపాట్లు కొన్ని వుండవచ్చు. కాని అటువంటివి చాల తక్కువగా వుంటాయి. మీ పొరపాట్లను మీ స్నేహితులకు చెప్పాలంటే, ముందుగా మీరెంతో సంకోచించవచ్చు. కాని ఇలా చెప్పడం మీకే ఎంతో సరదాగా Tటుంది. మీరు చేసిన పొరపాటును దేన్నయినా కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ అన్ని మీ నోట్బుక్లో గుర్తించండి. అలాగే పొరపాటు చేయవలసి వస్తుందేమోనన్న భయంతో
[11/23, 18:08] +91 97058 59828: ఏ పనైనా చేయడానికి వెనుబడితే ఆ సందర్భాన్ని సైతం గుర్తించండి. పరిమితులు లేని ప్రతిభ ఏ ఒక్కరికీ వుండదు
ఒక తెలివైన వ్యక్తి అన్ని రంగాలలోను సమాన ప్రతిభ కనపరచాలని, ఇతరుల కంటే తనకు తక్కువ విషయాలు తెలువని అంగీకరించడం తెలివి తక్కువతనానికి, అసమర్ధతకు చిహ్నముని అనుకుంటున్నారా? అలాగే, ప్రయత్నించితే ఏ రంగంలోనైనా పూర్తి ప్రావీణ్యతను సంపాదించవచ్చని భావిస్తున్నారా? ఈ రకమైన ఆటోచనా ధోరణి తప్పు అని వేరే చెప్పనవసరంలేదు.
ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని పరిమితులు వుంటాయి. మీరు చెస్ బాగా ఆడగలుగుతారు. కాని నాట్యం తెలియదని మీరు నిస్పృహ చెంద నవసరంలేదు. మీకు రాజకీయాల గురించి కూలంకషంగా తెలుసు, కాని సంగీతం గురించి తెలియదని నిరాశ చెందనక్కరలేదు. మనలో అత్యధికులకు అన్ని రంగాలలోను ప్రావీణ్యత ఉండదు. ఏవో కొన్ని రంగాలలో మాత్రమే వారికి నైపుణ్యం వుంటుంది. ఈ ఆధునిక కాలంలో, అన్ని విషయాలలోను నిష్ణాతులై వుండడం అసలు సాధ్యం కూడా కాదు. మీరు ప్రయత్నించితే ఏ రంగంలోనైనా రాణించగలమనుకోవడం కూడా తప్పే, ఈ ఆలోచనతోనే చాలమంది అసాధ్యమైన, తమకు అనువుగాని విషయాలను సాధించడానికి ప్రయత్నించుతూ తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకొంటుంటారు. మన పరిసరాలు, చిన్నతనం నుండీ మనపై ప్రసరించిన ప్రభావాలు, మనం జీవితం పట్ల పెంపొందించుకొన్న దృక్పథం మనకు కొన్ని పరిమితులేర్పరచుతుంటాయి. ప్రతి ఒక్కరూ మహోన్నతమైన సాహితీవేత్త కాలేదు. అలాగే ప్రతి ఒక్కరు అగ్రశ్రేణి క్రీడాకారుడు కాలేదు. అలాగే అందరూ ఏడడుగుల ఎత్తు ఎదగలేరు. అలాగే మీరు ఒకే సమయంలో ఢిల్లీలోను మద్రాసు లోను వుండలేరు. మీకు తెలియని విషయమేదైనా, మీకు తెలియదని ఖచ్చితంగా పేర్కొనగలగడం, మీ నిజాయితీకి, స్పష్టతకు చిహ్నంగా ఇతరులు గుర్తించగలుగుతారు.
మీకు ఒక విషయాన్ని గురించి తెలియకపోతే, ఆ అంశాన్ని నిర్భయంగా చెప్పడానికి మీరు సంకోచించే సందర్భాలను మీ నోట్బుక్లో గుర్తించండి. చాలా సందర్భాలలో ఏదైనా ఒక పుస్తకం గురించి చర్చ తల ఎత్తితే- అది చదివి వుండకపోయినా, చాలమంది చదివినట్లు తల వూపుతారు. అన్ని విషయాలు తెలిసినట్లు నటించకపోవడం వలన, ఇతరులు మిమ్మల్ని అధికంగా విశ్వసించడం ప్రారంభిస్తారు. మీకు ఖచ్చితంగా తెలియని విషయాలను గురించి తెలిసినట్లు చెప్పినప్పుడు. కాని, తెలియవని చెప్పినప్పుడుగాని మీ నోట్బుక్లో ఆ అంశాన్ని గుర్తించండి.
No comments:
Post a Comment