*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 71* ♥️
*చదివే ముందు... సున్నితంగా కళ్లు మూసుకోండి... మీ గుండె చప్పుడును అనుభూతి* *చెందండి...మన జీవితంలో ఉత్సాహాన్ని నింపే దాని గురించి ఆలోచించండి... చదవడం కొనసాగించండి...*
*ద్వీపంలో నివసిస్తున్న రాబందులు*
ఒకసారి రాబందుల సమూహమొకటి సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి చేరుకుంది. ఆ సముద్రంలో చాలా చేపలు, సముద్ర జీవులు ఉన్నాయి, వాటి కారణంగా రాబందులకు ఆహారానికి, నీటికి కొరత లేదు. ఇంకా వాటికి అనువైన విషయం ఏమిటంటే, ఆ ద్వీపంలో రాబందులపై దాడి చేయడానికి ఏ అడవి జంతువు లేదు.
అక్కడ రాబందులు చాలా సంతోషంగా ఉన్నాయి, ఎందుకంటే అవి ఇంతవరకు ఎక్కడా ఇంతసుఖంగా జీవించలేదు. మందలో చాలా యువ రాబందులు ఉన్నాయి, ఇంత సుఖవంతమైన జీవితం మరెక్కడా దొరకదు కాబట్టి అవి వాటి జీవితమంతా అక్కడే గడపాలని అనుకున్నాయి.
ఆ గుంపులో ఒక ముసలి రాబందు ఉంది. ఆ యువ రాబందులను చూసి, వాటి ఆలోచనలను తెలుసుకుని, ఆ రాబందు ఆందోళన చెందింది.
ఒకరోజు యువ రాబందులన్నింటినీ పిలిచి తన ఆందోళనను వ్యక్తపరిచింది: "చాలా కాలం నుండి మనం ఈ ద్వీపంలో నివసిస్తున్నాం. మనం ఎక్కడ నుండి వచ్చామో అదే అడవికి తిరిగి వెళ్లిపోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలాంటి సవాళ్లు లేకుండా జీవితాన్ని గడుపుతున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పటికీ కష్టాలకి, విపత్తులకి సిద్ధంగా ఉండలేం."
ఆ ముసలి రాబందు మాటలను ఖాతరు చేయకుండా, ఆ రాబందు వృద్ధాప్య ప్రభావం వల్ల ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతోందని భావించి, యువ రాబందులు ఈ సుఖవంతమైన జీవితాన్ని వదులుకోవడానికి నిరాకరించాయి.
ముసలి రాబందు ఆ యువ రాబందులందరికీ వివరించడానికి ప్రయత్నిస్తూ ఇలా అంది: “మీరంతా పట్టించుకోవడం లేదు, మీకు సుఖం అలవాటైపోయి, ఎగరడం మర్చిపోయారు? ఇలాంటి సమయాల్లో ఏదైనా ప్రమాదమొస్తే మీరు ఏంచేస్తారు? నాతో రండి."
కానీ ఎవ్వరూ వినలేదు. ముసలి రాబందు ఒంటరిగా మిగిలిపోయి, ఒంటరిగా పాత అడవికి తిరిగి వచ్చింది.
కొన్ని నెలలు ఇలా గడిచాయి, ఒక రోజు ముసలి రాబందు తన రాబందులను ఒకసారి చూద్దామని, యువ రాబందులు నివసించే ద్వీపానికి చేరుకుంది. అక్కడికి చేరుకొని, చుట్టూ చూడగా, ఆ దృశ్యం పూర్తిగా మారిపోయిఉంది. ఎక్కడ చూసినా రాబందుల మృతదేహాలు పడి ఉన్నాయి. చాలా రాబందులు రక్తపు మడుగులో పడిఉన్నాయి, చాలా గాయపడిఉన్నాయి.
ముసలి రాబందు అది చూసి ఆశ్చర్యపోయి గాయపడిన రాబందును "ఏమైంది?" అని అడిగింది. అది ఇలా జవాచ్చింది, "నీవు వెళ్ళిన తర్వాత, ఈ ద్వీపంలో మేము సంతోషంగా జీవిస్తూండగా, ఒక రోజు ఇక్కడకు ఓడ వచ్చింది, అందులోంచి చిరుతలను ఈ ద్వీపం మీద విడిచిపెట్టారు.
మొదట్లో అవి ఏమీ చేయలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత మేము ఎగరట్లేదని, దాడి చేయలేని లేదా మమ్మల్ని మేము రక్షించుకోలేనంతగా మా గోళ్లు బలహీనపడి ఉన్నాయని అవి గ్రహించాయి, దాంతో మాపై దాడి చేసి, తినడం మొదలుపెట్టాయి. అందువల్లే ఈ స్థితిలో ఉన్నాం. మీ మాట వినకపోవడం వల్లనే మాకు ఇలా జరిగిందేమో”.
ప్రస్తుత కాలంలో, ఎల్లప్పుడూ మనం మన సౌకర్యపు క్షేత్రంలో ఉండటానికే ఆలోచిస్తాం, ఇంకా దానికే ప్రయత్నిస్తాం. మనలని, మన కుటుంబాన్ని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచుకోవడానికే ప్రతిదీ చేస్తాం.
అయితే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎల్లప్పుడూ సౌకర్యపు క్షేత్రంలో ఉంచుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు కుటుంబాన్ని నిజంగా మనం సిద్ధం చేయగలమా? లేక అలా ఉంచి వారిని బలహీనపరుస్తున్నామా?
♾️
*జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మునుపటి కంటే బలంగా మీరు పైకి వస్తారు.* 🌼
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
💜🔺💜🔺💜🔺💜🔺💜
No comments:
Post a Comment