Monday, November 13, 2023

 అదృష్టవంతుడు సముద్రంలో పడ్డా, నోటిలో చేపతో తిరిగి రాగలదు. -ఆరల్

ఎక్కడా మచ్చలేని పరిపూర్ణమైన తెల్లని ఆవు కంటే అరుదైనవాడు అదృష్ట వంతుడు. --జువెనల్

అదృష్టం ఏ వ్యక్తినీ తెలివిమంతుడ్ని చెయ్యలేదు.

అదృష్టం తనంత తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు. స్వంతం చేసుకో ! అదే అదృష్టం అంటే.
                          - జాన్ వాట్సన్

* వివేకులు తమ కాలాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తారు. అవివేకులు చెడు అలవాట్లకు నిద్రపోవడానికి తమ కాలాన్ని వినియోగిస్తారు.
                     -

అజ్ఞానమే అన్ని దురదృష్టాలకు హేతువు. ఏదో ఒకటి నేర్చుకోకపోవడం. కంటే, అసలు పుట్టకుండా ఉండటమే మంచిది.
                                    - ప్లేటో

అజ్ఞానం సిగ్గెరుగదు.- రూసో

అనుమానం
* అనుమానం ప్రవేశించే ద్వారం నుండే, ప్రేమ బైటికి వెళ్లిపోతుంది.
                          -థామస్ పుల్లర్

అభివృద్ధి
* ఆచారమనే మట్టి దేవతను బద్దలుకొట్టి, నూతన సత్యములను నూతన ధర్మములను స్వీకరించినప్పుడే ఏ జాతి అయినా అభివృద్ధి చెందుతుంది.
                -Ebson

No comments:

Post a Comment