*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *”తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్ర మశుభాన్ ఆసురీ ష్వేవ యోనిషు॥”*
💖 *~తా॥ ఇలా నన్ను ద్వేషించే ఈ క్రూరులైన నరాధములను నేను ఎల్లప్పుడు జననమరణ సంసార మార్గంలో నీచయోనుల్లో విసిరేస్తాను.*
💞 *అసురస్వభావం గలవారు “ఇతరుల శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు” అని తెలియక వారిని ద్వేషిస్తుంటారు. అలా ద్వేషిస్తే వారు పరమాత్మను ద్వేషించినట్లే. అలాంటివారు ఎలాంటి క్రూరకర్మలకైనా వెనుదీయరు. అందుకే వారిని 'క్రూరాన్' - క్రూరకర్ములు అన్నారు. అట్టి క్రూరులను నరులు అనరు. నరాధములు అంటారు. మానవాధములు అంటారు.అంటే భగవంతునికి వారిపట్ల ఎంతటి హేయభావం ఉన్నదో ఈ పదాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు.*
💓 *నరాధముడవయ్యావా! నీకిక తగినశాస్తి తప్పదు. ఏమిటా శాస్తి..?*
💕 *తాన్ నరాధమాన్ ఆశుభాన్ ఆసురీషు యోనిషు ఏవ అహం క్షిపామి...*
💞 *~అలాంటి క్రూరులను - నరాధములను నీచమైన నికృష్టమైన ఆసురీ యోనులందు ఎల్లప్పుడూ విసిరేస్తుంటాను అంటున్నాడు భగవానుడు.*
💖 *”నేనే విసిరేస్తాను”అంటున్నాడు గనుక భగవంతుడు కర్మఫల ప్రదాత. శాసకుడు. అంతమాత్రాన ఆయన పక్షపాత బుద్ధితోనో, అస్తవ్యస్తంగానో చేయడు.*
💓 *~వారివారి కర్మలను బట్టే చేస్తాడు. ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మలే వస్తాయి. నీచయోనులంటే పశుపక్షి క్రిమికీటకాది జన్మలే. అంతేగాక 'యోనిషు' అని బహువచనం వాడటం వల్ల అనేక నీచజన్మలు ఎత్తాల్సివస్తుందన్నమాట.*
❤️ *కసాయివాడు గొర్రెను తెచ్చి నరకబోతుంటే అది ఎలాగో తప్పించుకొని పరుగెత్తి పోతుంది. కొంతదూరం పోగానే కసాయివాడు దానివెంట పరుగెత్తి పట్టితెచ్చి బలిఇస్తాడు. అలాగే ఈ నీచ జన్మల నుండి తప్పించుకుందామని ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు. క్రూరకర్మలు చేసినవాడికి ఆ కర్మఫలం ఉన్నంతవరకు ఒకదాని వెంట ఒకటి నీచ జన్మలు వస్తూనే ఉంటాయి. తప్పించుకొనే వీలులేదు.*
💞 *ఈ భయంకరమైన సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని అసురగుణాలను పారద్రోలాలి. ఇప్పుడు తెలివిగా తప్పులు చేశాం అని ఆనందిస్తే సరిపోదు. అప్పుడు ఏడుస్తూ కష్టాలు, దుఃఖాలు అనుభవించాలి. నికృష్టం అనుభవించాలి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment