🍀🌺🍀🌺🍀🌺🍀🌺
*కనబడని ధర్మం*
➖➖➖
*ధర్మం అంటూ ఉంటారు. దానిని ఎవరూ చూడలేదు కదా! ఆ చూడని ధర్మాన్ని ఒప్పుకో అని ఎందుకు నిర్బందిస్తారు?*
*ధర్మం అనేది కనబడకపోయినప్పటికీ దానిని ఆచరించడమే మేలు. ఆచరించకపోతే అనర్థం ఒకపక్షంలో తప్పదు.*
*ఎలా అంటే ఒక ఇద్దరు దారిలో నడుస్తూ ఉన్నారు. వారికి ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టలో పాము ఉందా? లేదా? అని వారిద్దరిలో విమర్శ వచ్చింది. ఒకడన్నాడు దానిలో పాము లేదు అని, ఒకడు పాము ఉంది అన్నాడు.*
*పాము లేదు అన్నవాడు పుట్టమీద కాలు పెట్టి వెళతాను అన్నాడు. పాము ఉంది అన్నవాడు దానిమీద కాలు పెడితే కాటేస్తుంది ప్రక్కనుంచి వెళతాను అన్నాడు.*
*వీళ్ళిద్దరి వివాదం వింటున్న మూడవ వాడు అయ్యా అక్కడ పాము ఉన్నా లేకపోయినా ప్రక్కనుంచే వెళ్ళడం మంచిది.*
*ఎందుకంటే అలా వెళ్తే ఎట్టి పరిస్థితిలో నీకు అనర్థం కాదు. అక్కడ నిజంగానే పాము ఉంటే దానిమీద కాలు పెడితే అది నిన్ను కాటేస్తుంది. ప్రక్కనుంచి వెళ్తే అక్కడ పాము ఉన్నా లేకపోయినా నీకేమీ ఇబ్బంది కలుగదు.*
*అలాగే పరలోకం ఉన్నా లేకపోయినా ధర్మాన్ని ఆచరించావు అంటే ఏ పక్షంలోనూ ఇబ్బంది కలుగదు. ధర్మాన్ని ఉల్లంఘించిన వాడికి ఆ పరలోకం ఉన్నది అనే గనుక తీర్మానం అయినట్లయితే వాడికి అనర్థం తప్పదు, వాడికి క్లేశం తప్పదు.*
*‘సందిగ్ధేపి పరే లోకే కర్తవ్యో ధర్మ ఏవ హి! నాస్తి చేన్నాస్తి నో హానిః అస్తి తే నాస్తి కో హతః!!*
*పరలోకం అనేది ఉన్నదా లేదా అన్న సందేహం ఉన్నా కూడా ధర్మాన్ని ఆచరించే పక్షంలో ఏవిధంగాను ఇబ్బంది అనేటటువంటిది కలుగదు. (సందేహానికి అవకాశం లేదు ఉన్నది అని సిద్ధాంతం చేశాం). కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ధర్మాన్ని ఉల్లంగించడానికి వీలులేదు.*
*భగవంతుడిని విశ్వసించకుండా ఉండడానికి వీలులేదు. భగవంతుడిని విశ్వసించాల్సిందే, ధర్మాన్ని ఆచరించవలసినదే.*
*దానివల్లనే నీకు శ్రేయస్సు కలుగుతుంది.ఇది మనయొక్క స్వధర్మం. *
*భగవద్గీత 3-35….*
“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ”
*ఈ ‘స్వధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. పరధర్మం జోలికి ఎన్నడూ పోవద్దు!’ అని భగవంతుడు భగవద్గీతలో దేన్నైతే చెప్పాడో దానిని మనం ప్రతి ఒక్కరం జ్ఞాపకం పెట్టుకోవాలి.*
*మనయొక్క స్వధర్మాన్ని సర్వదా ఆచరించాలి. పరధర్మం జోలికి ఎన్నడూ పోకూడదు. అలా పోయేవారికి కూడా మనం బుద్ధి చెప్పాలి. భగవంతుడి ఆదేశాన్ని మనం శిరసావహించి ఆచరించాలి.*
శృంగేరిజగద్గురువైభవం
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment