*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *మా తాతగారిని ఒకరు అడిగారట “స్వామీ! నాకు దేవుణ్ణి చూపించండి”అని.*
💕*’నీకు ఎన్ని ఎకరాలు ఉంది?’ అని అడిగారు తాతగారు.*
💕*’పది ఎకరాలు' చెప్పాడాయన.*
💕 *’ఆ పది ఎకరాలు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. దేవుణ్ణి చూపిస్తా' అన్నారు తాతగారు.*
💕*అంతే అక్కణ్ణుంచి మెల్లగా జారుకున్నాడతాయన.*
❤️ *తనకున్న సర్వస్వాన్ని వదిలినవాడే సర్వమై ఉన్న దైవాన్ని పొందుతాడు.*
💕*తొలి సర్వం - స్వార్థం.*
❤️ *మలి సర్వం - పరమార్థం.*
❤️*మనకు ఇద్దరు పిల్లలు ఉంటే… మన ఆస్తిని రెండు భాగాలు చేసి ఇద్దరికీ పంచుతాం కదా…!*
💕 *కనీసం దేవుడికి అంతా ఇవ్వకపోయినా....మూడో భాగం పెట్టి ఇచ్చినా అదొక పద్ధతి.*
❤️ *దేవుడికి మాత్రం రూపాయి కర్పూరం వెలిగించేసి “నన్నూ, నా కుటుంబానికి రక్షణగా ఉండు తండ్రీ” అని ప్రార్థిస్తాం.*
💕 *మన ఇంటిని కాపాలా కాసే వాచ్ మేన్ కు ఇచ్చే జీతమంత కూడా విశ్వరక్షకుడైన దేవునికి ఖర్చు పెట్టం.*
💕*తెల్లదుస్తులు ధరిస్తాం!*
💕*పట్టీలు పెడతాం!!*
💕*రుద్రాక్షలు ధరిస్తాం!!!*
💕*రుద్రాభిషేకాలు చేయిస్తాం!!!!*
💕*ప్రతివారం గుడికెళతాం!!!!!*
❤️ *’ఇదంతా దేవుడికోసమే’ అని భ్రమపడతాం.!?!?*
❤️ *దేవుడిపేరుతో చేసేదంతా దేవుడి కోసం కాదు కదా.?తనకోసమే.కదా..!?*
❤️ *రోగి ఔషధం పుచ్చుకునేది డాక్టరు కోసమా? తన కోసమే కదా!*
❤️ *’ఆధ్యాత్మికం’ అనే పేరుతో చేసేదంతా లౌకికవ్యవహారమే కదా.?!*
💖 *’త్యాగం’ అంటే ఇప్పటికిప్పుడే అంతా ఇచ్చేయమని కాదు. కనీసం మానసికంగానైనా సంసిద్ధతను కలిగి ఉండమని చెప్పడం.*
💕 *”నాది" అనుకున్నదంతా నాది కాదని తెలిసి ఉండడమే త్యాగం.*
💕 *”నేను" అనేది, అనుకునేది నేను కాదని తెలిసి ఉండడమే పరిత్యాగం.*
❤️ *”నాది” అనుకున్నది ఏ కారణం చేతనైనా నీ నుంచి దూరమైపోతే, చలించకుండా ఉండే శక్తి మనసుకు ఉండడమే త్యాగం.*
💕 *వదలలేకపోవడం - లోభం.*
💖 *వదలగలిగి వదలకుండా ఉండడం - త్యాగం.*
💓 *ఉన్నదంతా ఆయనే అయినప్పుడు ఆయనది ఆయనికివ్వడం త్యాగమా?*
💞 *’త్యాగం’ అనేది మానసిక సంబంధిత విషయమే.*
❤️ *”ఏమైనా రానీ! ఏమైనా పోనీ!! సదా "నేను"ఉంటాను!!!” అన్న జ్ఞానమే త్యాగమూ, భోగమూనూ.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment