**"దిగులు***
***మరణించిన వారి గురించి వ్యధ చెందడం నిజంగా పిచ్చితనమే. మరణించిన వారికి తెలియని బాధలను అది జీవించిన వారికి సృష్టిస్తుంది. --జెనోఫెన్
***ప్రతి వ్యధ వెనుక కనీసం ఇరవై నీడలు ఉంటాయి. విచిత్రమేమంటే ఆ నీడలన్నీ నీవు సృష్టించినవే.
-సిడ్నీ స్మిత్
***రెండు రోజులు - నిన్న, రేపు - గురించి ఏ ఒక్కరూ ఆందోళన చెందకూడదు.
-రాబర్ట్ జోన్స్ బర్గెట్టె
***చిన్న చిన్న చింతలు చిన్న ఈగల వంటివి. చిన్న కదలిక లేదా అతి చిన్న కార్యం వాటిని చెదరగొడతాయి.
***దాట శక్యం కాని అవరోధం 'విచారం'. -Swami Vivekananda
***దిగులుపడటం వల్ల రేపటి వేదనా భారం అణువంతైనా తగ్గకపోగా, ఈనాటిమనోబలం ఎంతో సన్నగిల్లుతుంది.ఎ.జె.కోనిన్
****దిగులుతో నమిలిందంతా చొప్ప, మింగిందంతా చేదు, దిగులుతోటి బ్రతుకు బ్రతుకే కాదు.
-కాళోజి నారాయణరావు
***మనిషిని అతను చేసే పని చంపదు. అతని మనసులోని దిగులే అతని చావుకు కారణమౌతుంది.
-హెన్రీ వార్డ్ బీచర్
***స్వర్గం తీర్చలేని దిగులు భూమిమీద లేదు.-థామస్ మూర్
***దిగులు ఉయ్యాల కుర్చీవంటిది. అది కదిలిస్తుంటుంది కాని,ఎక్కడకూ తీసుకుపోదు.
-జోయల్ గుడ్మన్
***దిగులును నీవెంట పడక గదిలోకి తీసుకుపోకు. అది నీ వీపు మీద మూటలా బాధిస్తుంది.
-హాలీ బర్టన్
***చింతవల్ల అతి చిన్న వస్తువుకు కూడా పెద్ద నీడ ఉన్నట్లుగా కన్పిస్తుంది
-స్వీడన్ సామెత
****నేను చాలా పని ఒత్తిడిలో ఉన్నాను. చింతించడానికి కూడా నాకు తీరిక లేదు.
---చర్చిల్
No comments:
Post a Comment