ఆరోగ్యం ఆనందం సంపద
🩺🏃♀️🏃♂️😄💎🚘🛵✈️💰💴
*మానవసంబంధాలకి లాభకరమైన సూచనలు*
1 మీరు అలవాటు కొద్దీ ఎప్పుడూ ఆలోచించే విషయాలని రికార్డు చేసే మిషను మీ సుప్తచేతన, అవతలి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే, మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తున్నారనే అర్ధం.
2. ద్వేషమూ, కోపమూ నిండిన ఆలోచన మానసికంగా విషతుల్యం, ఇతరులు గురించి చెడుగా ఆలోచించకండి, దాని అర్ధం మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నారనే. మీ ప్రపంచంలో ఆలోచించేది మీరొక్కరే. మీ ఆలోచనలు. సృజనాత్మకమైనవి.
3.మీ మనసు ఒక సృజనాత్మకమైన మాధ్యమం. అందుకని, అవతలి వ్యక్తి గురించి మీరు అనుకునేది, మీ అనుభవంలోకి తెచ్చుకుంటారు. స్వర్ణ నియమానికి మనస్తత్వశాస్త్రం చెప్పే అర్థం ఇదే. మీరు ఆలోచించినట్టే ఇతరులు మీ గురించి ఆలోచిస్తారు. ఇతరులు మీగురించి ఎలా ఆలోచించాలని మీరనుకుంటారో, వాళ్లు కూడా అదే విధంగా ఆలోచిస్తారు..
4.ఇతరులని మోసం, దోపిడీ, దగా చేస్తే మీకు మీరు లేమి, నష్టం, పరిమితి సృష్టించుకున్నట్టే. మీ సుప్తచేతన మీ అంతరంగంలోని ప్రేరణలనీ, ఆలోచనలనీ, భావాలనీ నమోదు చేస్తుంది. అవి వ్యతిరేకంగా ఉన్నట్టయితే, నష్టం, పరిమితులూ, ఇబ్బందులూ, లెక్కలేనన్ని రకాలుగా మీ దగ్గరకు చేరుకుంటాయి
ఇతరుల పట్ల మీరు చేసే పనులు, మీకు మీరు చేసుకుంటున్నట్టే.
5. మీరు చేసే మంచి, చూపించే దయ, అందించే ప్రేమ అన్నీ ఎన్నోరెట్లు పెరిగిమీకు మళ్లీ వచ్చి చేరతాయి.
6. ఇతరులని గురించి మీరు ఆలోచించే పద్ధతికి మీరే బాధ్యులు. గుర్తుంచుకోండి. మీరు వాళ్లగురించి ఆలోచించే పద్ధతికి వాళ్లు బాధ్యులు కారు. మీ ఆలోచనలు పునరుత్పత్తి చెందుతాయి. అవతలి వ్యక్తి గురించి ఇప్పుడు మీరేమను కుంటున్నారు?
7. భావపరిపక్వతని సాధించండి, అవతలి వ్యక్తి మీతో ఏకీభవించకపోవటాన్ని అనుమతించండి. మీ అభిప్రాయంతో ఏకీభవించకపోయే హక్కు వాళ్లకి పూర్తిగా ఉంది, అలాగే మీకు కూడా అలాటి స్వేచ్ఛ ఉంది. అవతలి వ్యక్తిని నొప్పించకుండానే మీరు వాళ్లతో విభేదించవచ్చు.
8. భయం తాలూకు ప్రకంపనలని జంతువులలాగే, చాలామంది సున్నితమనస్సులు కూడా అనుభవించగలరు, మీరు దాచిపెట్టుకున్నారని అనుకుంటున్న ఆలోచనలు.. మీ గొంతులో వినిపిస్తాయి, మీ ముఖకవళికల్లో, మీ శరీరం కదిలే తీరుల | వెల్లడవుతాయి. వ్యతిరేకమైన ఆలోచనల విషయంలోనూ, సానుకూలన ఆలోచనల విషయంలోనూ జరిగేది ఇదే.
9మీ మనసులోని మాటలు మీ నిశ్శబ్దమైన ఆలోచనలకీ, భావాలకీ ప్రతినిధులు వాటిని ఇతరులు మీపట్ల స్పందించే తీరులో మీరు అనుభవిస్తారు.
10. మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో, అదే ఇతరులకోసం కూడా కోరుకోండి. సామరస్యంతో కూడిన మానవసంబంధాలకి ఇదే కీలకం.
11. మీ యజమాని గురించి మీ అభిప్రాయాన్నీ, అంచనానీ మార్చుకోండి. అతను గాని ఆమె గాని ప్రేమ అనే స్వర్ణ నియమాన్ని పాటిస్తోందనీ, దానికి తగ్గట్టే వారి ప్రతిస్పందన ఉంటుందనీ తెలుసుకోండి.
12. అవతలి వ్యక్తిని మీరు అనుమతిస్తేగాని, వాళ్లు మీకు కోపాన్నీ, విసుగునీ తెప్పించలేరు. మీ ఆలోచన సృజనాత్మకమైనది; మీరు అవతలి వ్యక్తిని ఆశీర్వదించగలరు. మిమ్మల్ని ఎవరైనా అవమానకరమైన మాట అంటే, "దేవుడి శాంతి నీ ఆత్మలో నిండుగాక!" అని అనే స్వేచ్ఛ మీకుంది.
13. అవతలివారితో సఖ్యంగా ఉండాలంటే ప్రేమ అవసరం. ప్రేమ అంటే అర్థం
చేసుకోవటం, సద్భావం, అవతలి వ్యక్తిలోని దైవత్వాన్ని గౌరవించటం.
14. వ్యతిరేకమైన ధోరణి అలవడి ఇబ్బందికరంగానూ, అప్రియంగానూ తయారైన వాళ్లని అర్ధం చేసుకుని, సానుభూతి చూపండి. అందరిలో లాగే దైవత్వం ఒక నిప్పురవ్వులా వారిలో ఉంది. అందర్నీ అర్థం చేసుకోవటమంటే అందర్నీ క్షమించటమే.
15. ఇతరుల విజయోల్లాసాన్ని మీరు కూడా అనుభవించండి, ప్రమోషన్, అదృష్టం ఎదుటివారిని వరిస్తే మీరు సంతోషించండి. అలా చెయ్యటం వల్ల అదృష్టాన్ని మీరు మీవైపుకి ఆకర్షిస్తారు.
16. అవతలి వ్యక్తి భావోద్రేకాలకి గురై, కోపంతో కేకలు పెట్టినా మీరు లొంగద్దు, తృప్తిపరచటం అనేది ఎన్నడూ ఫలితాలని సాధించలేదు. అలాటి అవతలి వ్యక్తికి దాసోహం అనకండి. ఏది సరైనది అనుకుంటారో దానివైపు నిలబడండి. మీ ఆదర్శాలకి కట్టుబడి ఉండండి. మీకు శాంతినీ, సంతోషాన్నీ, ఆనందాన్నీ
ఇచ్చే మానసిక దృష్టే సరైనదనీ, మంచిదనీ, సత్యమనీ తెలుసుకోండి. మీకు వరంగా ఉన్నది, అందరికీ వరమే అవుతుంది.
17. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక్క ప్రేమ మాత్రమే. ఇక ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే అందరికోసం ఆశించటం - ఆరోగ్యం. ఆనందం, జీవితంలో ఉండే మంచివన్నీ.
సేకరణ
డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి
💎💎💎💎💎💎💎💎💎💎💎
No comments:
Post a Comment