Tuesday, November 28, 2023

కోరికలు మంచివా? చెడ్డవా?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :---  ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --20*🌷

🍁  *ప్రశ్న :--- కోరికలు మంచివా? చెడ్డవా?*

🍀 *పత్రీజీ :---* కోరికలు ఉండటం ఎంతో ముఖ్యం. మితిమీరిన కోరికలు ఉండటమే అన్ని సమస్యలకూ హేతువు. ఒక జంతువును పట్టి, హింసించి, చంపి తినటం అనేది ఒక చెడ్డ కోరిక. ఎందుకంటే మీరు దానికి హాని కలిగిస్తున్నారు. అలా కాకుండా అదివరకే దానంతట అదిగా చనిపోయిన ఒక జంతువును తింటే అది వేరే సంగతి. ఎందుకంటే మీరు స్వయంగా దాని ప్రాణాలను హరించటం లేదు కనుక. నోరు లేని మూగ జీవాలను చంపి పొట్టన పెట్టుకోవటం ఎందుకు? అంతగా తినాలనిపిస్తే చనిపోయిన జంతువులను వెతికి పట్టుకుని తింటే కనీసం మీ వల్ల ఎవరికీ హాని కలుగదు. దానికి బదులుగా సజీవమైన ప్రాణిని పట్టి, హింసించి, చంపి తింటే మీ నీచమైన కోరిక, దురాశ తీరుతుందేమో కానీ అది మీకు ఏ మాత్రం శ్రేయస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించదు. 

🍁  *ప్రశ్న :--- పెరుగుట విరుగుట కొరకే’ అనే వ్యాఖ్యలో అంతరార్థం ఏమిటి? ఎందుకు అలా అవుతుంది?*

🍀 *పత్రీజీ :---* ఆధ్యాత్మికత అంటే శాశ్వతమైన అనంతమైన స్థితి నుంచి ఆలోచించటం అని అర్థం. మరో ప్రక్క భౌతికత అంటే తాత్కాలికమైన స్థితి నుంచి ఆలోచించటం. అందుకని మీ దృష్టి కోణాన్ని అశాశ్వతమైన పరిమితమైన స్థితి నుంచి, శాశ్వతమైన అనంతమైన స్థితికి మార్చుకోవాలి. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment