*ఆనాటి అనురాగాలు ఏవీ? ఈనాడు అడుగడుగునా అసుయా ద్వేషాలే!!*
🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲☺️😗ప్రపంచీకరణ భారత కుటుంబాల్లో విప్లవాత్మకమైన పెను మార్పు తెచ్చింది...డబ్బు...హోదా... పరపతి ప్రతి మనిషిలో సోషల్ స్టేటస్ అయింది! రేపటి తరానికి నాలుగు రాళ్ళు సంపాదించే ఆలోచన ఏనాడో పోయింది...ఈ రోజు రాజా లా బ్రతకాలి అనే కాన్సెప్ట్ తో *పెద్దరికం* మసగబారి పోయి *నీకేంటి నాకేంటి* హ్యుమన్ సైకాలజీ లో డబ్బు ప్రధాన భాగమైంది! ఆత్మీయతలు, అనుబంధాలు అన్ని కృత్రిమం అయ్యాయి..."మా అమ్మాయి ఆస్ట్రేలియా లో ఉంది" అంటే "మా అమ్మాయి యూ ఎస్ లో ఉందనే" బడాయి లో తన్నుకొస్తున్న మాతృత్వ ఛాయలు గొప్పింటి సంస్కారం పేరిట కళ్ళ లో నీరు అవిరి చేసుకుంటూ జీవచ్చవ్వాల్లా వారి కోసం ఎదురు చూస్తున్నారు... పది మంది పిల్లలు ఆనాడు ఉన్నా కూడా మాతృమూర్తి ఒకే కంచంలో మామిడి కాయ ముద్ద కలిపి తలా ఒక్క బుక్క పెడితే ఆ తల్లి కడుపు నిండినంత సంబర పడేది! ఉమ్మడి కుటుంబాల్లో తోటి కోడళ్ళు...అన్న తమ్ముళ్లు, బావమరదులు...అమ్మమ్మ గారి ఇళ్లు, మేనమామ సంబరం, మేన బావల పరాచికాలు, మేన వదిన గోరింటాకు పడితే ఆ సంబరం...మేన మరదల్లా ఆఫ్ సారీ అందాలు...అక్క చెల్లెళ్ళు అమ్మా గారింట్లోకి వస్తే కలసి పిండి వంటలు చేసుకుంటూ, ఎన్నో చిన్ననాటి కబుర్లు...చేద బావిట్లో నీళ్ళు తోడే దగ్గరి నుండి చెరువు దగ్గర కోతికొమ్మచ్చి ఆడిన ఆ రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించి తిరిగి మెట్టింట అడుగుపెట్టి ఏడాది పొడుగునా ఆ జ్ఞాపకాలతో ఆనంద భాష్పాలు కురిపించి, తమ పిల్లలకు ముచ్చట్ల తో తన్మయత్వం పొందే వారు!! అమ్మతో మేనత్త అనురాగం, పుట్టింటి వారినీ అక్కున చేర్చుకొని అత్తలు ఆనంద పడే ఆ నాటి మధుర క్షణాలు తీయగా పంచుకొని అన్న వదినల ఆత్మీయత గురించి చెబుతుంటే, మేనత్త ఒడిలో తల్లిలా సేద దీరే ఆ నాటి పిల్లల అనురాగం, ఆప్యాయత ఈనాడు కనిపిస్తుందా?! ఇప్పుడు అంతా కమర్షియల్ బంధాలు...అన్నదమ్ముల అస్తి గొడవలు, అక్కా చెల్లెళ్ల పోటీ తత్వం...మేనత్త లు పుట్టింటి ముఖం ఎరుగరు *సెకండ్ జనరేషన్* గ్యాప్ ఎక్కువైంది...అన్న దమ్ముల పిల్లలే ఏడాది కొక సారి కూడా చూసుకో లేని స్థితి...అక్కా చెల్లెళ్ల ను ఆదరించే మరదళ్లు లేరు...ఒక వేళ *వదిన ఈ సంక్రాతి పండుగకు ఇంటికి వస్తాను* అంటే *మా పుట్టింటికి నేను వెళుతున్న నమ్మా* అనే కుసంస్కారం నేటి ఆచారం!!🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔అసూయ...... నాటికీ, నేటికీ అనేక మంది పురోగతికి ఆటంకంగా నిలుస్తోంది. ఇది పేద, ధనిక తరగతులు అనే భేదం లేకుండా ఆయా తరగతులకు తగ్గట్టు తగిన మోతాదులో అసూయా, ద్వేషాలు రగులుతూనే ఉన్నాయి. మనం సాధించలేని దాన్ని మరెవరైనా సాధించారని తెలిస్తే ఉన్నట్టుండి అసూయ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తద్వారా ఏదైనా చేటు జరిగేంతవరకు అది మనల్ని వదలదు! తోబుట్టువులు (సిబిలింగ్) ఈర్ష్య ద్వేషాలు మొదలయ్యాయి! అక్కకు మంచి సంబంధం చూసి నాకు దరిద్రం గొట్టు వానికి కట్టబెట్టారు... అని తల్లి తండ్రి నీ దూరం పెట్టిన మహాలక్ష్మి తల్లులు కోకొల్లలు!!
అమ్మమ్మ పురిట్లోనే మనకు కామన్ సెన్స్ (ఇంగిత జ్ఞానం) నేర్పింది...కుటుంబ వ్యవస్థ అమ్మ పుట్టింట్లో నేర్చుకున్నాం...ఈనాడు ఆ సెన్స్ లోపించింది! ఈ రోజుల్లొ ఆర్గానిక్ కూరగాయలు గానీ.... ఆనాడు పెరట్లో ఆనప కాయ తెంపి సెనగ పిండి లో పిట్లా చేసి పూరీలు అద్దుకొని తింటుంటే ఆ రుచే వేరు! ఈ నాడు చుట్టాలు వస్తున్నారంటే హోటల్ నుండి టిఫిన్స్ తెప్పించి అందులో నాలుగు ఇడ్లీలు కట్టిస్తే, రెండే ఇడ్లీలు గెస్ట్ లకు పెట్టీ సర్దే గొప్ప సంస్కారం దానికి *ఆర్థిక క్రమ శిక్షణ* అనే పేరుపెట్టారు! వీకెండ్ లో మాత్రం స్టార్ హొట్లలో వేలకు వేల కు ఖర్చు చేసే సోషల్ స్టేటస్ అనేప్పుడు ఆర్థిక క్రమశిక్షణ కనబడదు!! ఇక పొరుగింటి అసూయ అంతా ఇంతా కాదు...సమాజ సేవ చేస్తున్న వాన్ని *పనిలేక* ఆ పని చేస్తున్నాడని *ఏదో లాభం లేనిది* చేస్తాడా? అని నోటికొచ్చిన వాగుడు వాగుతారు! ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంచుకుంటారు...ఆ రంగంలో రాణినించాలి అంటే కటోర శ్రమ అవసరం! కొంత మందికి ఎంత డబ్బున్నా సుఖ పడే యోగం ఉండదు...పక్క వాడు సుఖ పడితే కూడా ఓర్వలేని వారు ఉంటే...*మా అక్కా ఇలా... మా అన్న ఇలా...మా చెల్లి ఇలా* అనే ఇల్లాళ్లు వాడికి తోడైతే ఇంకేముంది పచ్చని సంసారంలో చిచ్చు మొదలు!! అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. అసూయతో మనుషులు కృంగిపోతారు. అసూయ విషం లాగా పనిచేసి మానసిక అరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసూయ సుగుణాలన్నింటినీ నాశనం చేస్తుంది. లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఆ కథ ముగింపు మీకు తెలుసు !!దుర్యోధనునిలో బలం, ఉత్సాహం, శక్తి సామర్థ్యం, ప్రజ్ఞ ఉన్నా అసూయ అనే దుర్గణం వాటన్నింటినీ నాశనం చేసింది.
బృహస్పతీ, సంవర్తుడూ అన్నదమ్ముల కథ చదవండి... ఇద్దరు మేధావులే కానీ ఒకరి ప్రతిభ ఒకరు నచ్చక ఇద్దరు పతనం అవుతారు...ఇక ఒక రాజయ్య దేవుని కోసం ఘోర తప్పస్సు చేసి దేవుడు ప్రత్యక్షం కాగానే వరం అడుగుతాడు...*పక్కింటి మల్లయ్య కన్నా నాకు రెట్టింపు సౌఖ్యం, ధన రాశులు కావాలి* అనే కోరిక కోరుతాడు... దేవుడు ఆయన మాట మన్నించి... "మల్లయ్య పూర్వ జన్మ సుకృతం వల్ల ముందే వరం పొందాడు... నీకు ఎంత సంపద ఉన్నా మీకన్నా ఎక్కువ సంపదలు ఆయన వశం అవుతాయి" అంటాడు...అప్పుడు "ప్రతి విషయంలో నాకన్నా అధికంగా ఉంటాడు కాబట్టి నా కన్ను తీసేయండి... అప్పుడు మల్లయ్య రెండు కళ్ళు పోతాయ్" కదా అంటాడు...అలాగా ఉంటుంది నేటి సమాజ రీతి!!
No comments:
Post a Comment