Tuesday, November 14, 2023

సుభాషితాలు ఆనందమయ జీవన మార్గదర్శకాలు

 సుభాషితాలు

ఆనందమయ జీవన మార్గదర్శకాలు

1. పెద్దల మాటలు కావాలి మన అందరికీ ఆచరణీయ సూత్రాలు

2. దయ గల హృదయం భగవంతుని నిలయం

3. కాలమే ఉత్తమ గురువు ప్రపంచమే ఉత్తమ గ్రంథం

4. పరోపకారమే పుణ్యం పర పీడనమే పాపం... ఆది శంకరాచార్యులు

5. కాలం ప్రకృతి, ధైర్యం, సహనం ఈ నాలుగూ మాన్పలేని గాయం లేదు.

6. వ్యక్తిగత శ్రేయస్సు సామాజిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది.

7. సంతోషమే స్వర్గం దుఃఖమే నరకం

8
సర్వ మానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్కృతి

9
విద్య అనేది ఉపాధి అవకాశాలతో పాటు, నైతిక విలువలను పెంపొందించేదిగా ఉండాలి.

10
ఆస్తులు ఎక్కువ ఉన్న వారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్న వారే భాగ్యవంతులు

11
ఒక పని చేస్తూ వేరొక ఆలోచన చేస్తే - అది పరధ్యానం చేస్తున్న పనిపై మనసును లగ్నం చేస్తే - అదే ధ్యానం

12
మంచి స్వభావమే | అన్నింటినీ మించిన ఆభరణం... ఆది శంకరాచార్యులు

13
మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వాన్ని మించిన మతం లేదు.

14
ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరిసా

15
సమాజ సేవకు కావలసింది సంపద కాదు - ఉదార హృదయం

No comments:

Post a Comment