🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --23*🌷
🍁 *ప్రశ్న :--- ఎరుక అంటే ఏమిటి?*
🍀 *పత్రీజీ :---* ఒకానొక పరిస్థితి యొక్క కోణాలన్నింటి గురించి పూర్తి స్పృహతో ఉండటమే ఎరుక అని చెప్పుకోవచ్చు. ఎవేర్నెస్, ఎరుక అనే పదానికి పర్యాయ పదంగా కాన్షియస్నెస్, చైతన్యం అనే పదాన్ని వాడుతూంటాం. అవి రెండూ దాదాపుగా అదే అర్థాన్ని వెలిబుచ్చుతూ ఉంటాయి.
🍁 *ప్రశ్న :--- మన ఎరుకను ఎలా పెంపొందించుకోవచ్చు?*
🍀 *పత్రీజీ :---* మనమంతా ఎరుక/చైతన్యం అనే పదార్థం చేత సృష్టించబడ్డాం. ధ్యాన సాధనను పెంచండి. ఆత్మైక స్థితిలో కొనసాగండి. ఆత్మను ఉద్ధరించుకోండి. మీతో మీరు మరింత గాఢమైన అనుసంధానంలో ఉండండి. అంటే మీ అస్తిత్వంతో ఏకమైపొండి. ఎముకలు, కండరాలు, ఇంద్రియాలతో కాదు. వీటిలో ఎంత ఎక్కువగా కలిసిపోతే వాటినే పెంపొందించుకుంటాం. కానీ ఎరుకను కాదు. మన ఆత్మ తత్వంతో ఏకమైనప్పుడే ఎరుక యొక్క మహత్మ్యాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, ఉదారతనూ అనుభూతి చెందుతాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment