వంశం వృద్ధి చెందాలంటే;!! దీని గురించి ఆలోచించండి!!😊 👇🏿👇🏿👇🏿
కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు.
అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది.😌
ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా
ఏదో తూ..తూ...మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతోంది!!
దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు!!కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు,,👇
1● అతి తెలివి
2● చిన్న తప్పును కూడా భరించే శక్తి, సహనం లేవు.😌
3● అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).
4● పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకోక పోవడం.😌
5● ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం!!
ఎక్కడో ఉన్న సినిమా నటులు, ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు!!
కానీ,
ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.😌
6● చిన్న చిన్నదానికీ అలిగి, దగ్గరి వారికి కూడా దూరం అవుతున్నారు.
7● ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది.☺️
8● ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.😌
9● ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు!!
అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు!!
అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో, ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది!!
అందుకే
యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు!! "ముఫై దాటినా" పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు!! గత ముఫై నలభై ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.
10● ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం, తదితర కారణాలు అధికమయ్యాయి
11● మనుష్యులు అంటేనే విలువ లేదు!! మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది!! అధిక జనాభా, సుఖ విలాస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెగింపుతనం వచ్చింది.☺️
12● మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.😌
13● కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.😌
14● మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది!!
మొరటుగా ప్రవర్తిస్తున్నారు!! నేను, నా భార్య/భర్త, అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది!! పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది!!
ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు!!
కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు!! ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి!! అన్నా దమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేవు!! సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది!!
ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో!! ఒక నాటకం!! ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది☺️
15● డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం!!
ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు☺️ మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు!!
ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము!! అరణ్య రోదన మాత్రమే!! కాబట్టి మన ఫ్యామిలీ వ్యవస్థను మనం కాపాడుకోవడం మన సనాతన ధర్మంలో పరిరక్షణలో భాగంగా మన కుటుంబ వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటూ;
మన యొక్క కుటుంబ సంబంధాలను మరియు వారి పేర్లను; అనగా అమ్మానాన్న అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు బామ్మ తాత ఇటువంటి పదాలను తెలుగులోనే ఉచ్చరిస్తూ మన యొక్క తెలుగుని చాటుకొని మరియు మన యొక్క కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా మరింత పాటు పడదాం!!!😌😌😌
"ఆలోచించండి"..!!!✍🏻
🔆🕉️🌳🌏✨
సేకరణ.... !!!✍🏻
No comments:
Post a Comment