*స్మార్ట్ ఫోన్‌లో వచ్చే ఈ 7 మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండండి*
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మెసేజ్ లతో కస్టమర్ల ఖాతా నుండి లక్షల రూపాయలు కాజేస్తున్నారు.. ముఖ్యంగా ఏడు రకాల మెసేజ్ లతో ప్రతిరోజు బాధితుల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్నారు. అటు వాట్సప్ తో పాటు ఇటు టెక్స్ట్ మెసేజ్ లలో ప్రతిరోజు వందల మంది బాధితులకు సైబర్ క్రిమినల్స్ స్కాం లింకులను పంపిస్తుంటారు. తాజాగా సెక్యూరిటీ సంస్థ Mac free విడుదల చేసిన గ్లోబల్ స్కాం మెసేజ్ స్టడీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్టులో స్మార్ట్ ఫోన్ యూజర్ లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. బాధితుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులను ఖాళీ చేసినందుకు టెక్స్ట్ మెసేజ్ లను అస్త్రంగా వాడుతున్నారు సైబర్ క్రిమినల్స్..7 రకాలుగా బాధితుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తున్నారు క్రిమినల్స్.. ఎట్టి పరిస్థితుల్లో ఈ లింకులు ఓపెన్ చేయవద్దని సెక్యూరిటీ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది.
ఈ ఏడు రకాల మెసేజ్ ల జోలికి వెళ్లకండి:
*1.”మీరు బహుమతి గెలిచారు!”*
ఈ మెసేజ్ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఈ మెసేజ్ దర్శనమిస్తుంది. మీరు ఒక ఆవార్డ్ గెలిచినట్టు ఈ మెసేజ్ సారాంశం ఉంటుంది. అవార్డును క్లైమ్ చేసుకోవాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయాల్సిందిగా మెసేజ్ కనిపిస్తుంది. ఆ లింకు క్లిక్ చేయగానే మీ అకౌంట్ లో నుండి డబ్బులు మాయమవుతాయి.
*2.ఫేక్ జాబ్ నోటిఫికేషన్ లు*
సైబర్ నేరగాళ్లు బాధితులను మోసం చేసేందుకు ఎంచుకున్న మెసేజ్ మార్గం ఇది. సైబర్ క్రిమినల్స్ దగ్గర ఉన్న డేటాతో నిరుద్యోగులకు జాబ్ అలర్ట్ పేరుతో వల వేస్తారు. ఎలాంటి జాబ్ ఆఫర్లు మెసేజ రూపంలో రావు. ఎలాంటి సంస్థ కూడా మెసేజ్ రూపంలో జాబ్ ఆఫర్ చేయదు.. పలానా సంస్థ జాబ్ ఆఫర్ చేయాలి అనుకుంటే కేవలం ఈమెయిల్ ద్వారానే సంప్రదిస్తుంది. మెసేజ్, వాట్సప్ రూపంలో వచ్చే జాబ్ ఆఫర్లను ఎవరు నమ్మకూడదు.
*3)బ్యాంక్ అలెర్ట్ మెసేజ్ (url)*
ఏ బ్యాంకు నుండి కేవైసీ కోసం అడగరు. బ్యాంక్ అలర్ట్ పేరుతో వచ్చే మెసేజ్ url ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి. కేవైసీ పేరుతో వచ్చే ఈ మెసేజ్ లు బాధితుల అకౌంట్ దొంగలించడానికి స్కామర్లు ఉపయోగిస్తారు.
*4) కొనని వస్తువుపై ఫీడ్ బ్యాక్ పేరుతో*
మీరు ఎలాంటి వస్తువు కొనకపోయినా, షాపింగ్ సంస్థ నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ లింక్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి. ఒకవేళ మీరు షాపింగ్ చేయకపోయినా మెసేజ్ రూపంలో లింక్ వచ్చిందంటే అది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించండి.
*5)ఓటీటీ సబ్స్క్రిప్షన్ అప్డేట్స్*
ఓటీటీ లో ఫ్రీ ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్ లను లైట్ తీసుకోండి. ఇటీవల ఓటీటీకి విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మకండి.. ఈ లింకు క్లిక్ చేస్తే Netflix, prime ఫ్రీగా చూడవచ్చు అనే లింకులను ఓపెన్ చేసి మోసపోకండి.
*6)డెలివరీ పేరుతో ఫ్రాడ్ మెసేజ్*
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినా.. కొన్నిసార్లు మీకు డెలివరీ మిస్సయిందని.. డెలివరీలో ప్రాబ్లం ఉందని వచ్చే ఎస్‌ఎంఎస్, వాట్సాప్ నోటిఫికేషన్లు చాలా ప్రమాదకరం.
*7)అమేజాన్ సెక్యూరిటీ పేరుతో వచ్చే ఫేక్ అలెర్ట్*
అమెజాన్ సెక్యూరిటీ పేరుతో వచ్చే ఎలాంటి నోటిఫికేషన్ మెసేజ్ అయినా ఫ్రాడ్ అని గుర్తించండి.. అమెజాన్ లాంటి సంస్థ ఎస్ఎంఎస్ లేదా వాట్సప్ లో ఎప్పుడు సంప్రదించదని గుర్తించండి.
ఈ 7 మెసేజ్ లను అవాయిడ్ చేస్తే మీరు సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఉంటారు.. తని సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 82 శాతం మంది భారతీయులు వీటిని క్లిక్ చేసి సైబర్ నేరానికి బాధితులు అవుతున్నారు. ఇలాంటి మెసేజ్ ల నుండి వచ్చే లింకులను క్లిక్ చేసి భారతీయులు ఎక్కువగా నష్టపోయినట్టు రిపోర్ట్ చెబుతుంది. ప్రతిరోజు సంఘటన ఒక్కో భారతీయుడికి ఈ స్కామర్లు 12 ఫేక్ మెసేజ్ లను పంపిస్తూ నేరానికి పాల్పడుతున్నారు..ఇలాంటి మెసేజ్ ల పై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి.
No comments:
Post a Comment