పట్టుదలనే ఆయుధం "
ఓ యువత ..
పట్టుదల మీ ఆయుధం
మీ ఇష్టమైన అంశాన్ని విడువకు
కష్టమైన..ఇష్టంగా మలుచుకొండి
ఓ విశిష్ట కర్తవ్యంతోనే సాగిపొండి
ఎవరు తిట్టినా నెట్టినా
ఎవరు ఎమన్నా వదిలేయకండి...
కొన్ని వేల జనం మీచుట్టూ..
అది మరువ కూడదు...
భయపడకండి !! మనసు పెట్టండి!!
మంచి ఆలోచన తడుతుంది...
మీరుఅనుకున్నది మదిలో మెదులుతుంది
పట్టుకున్న ఇష్టాన్ని వదులకండి ...
వచ్చిన అదృష్టాన్ని విడువకండి ...
మీలో ఒక సుదీర్ఘ చూపు ఉంది...
మీకు తెలియకుండానే మేలు చేస్తుంది..
కష్టాన్ని ఎదిరించైనా ఇష్టాన్ని నిలుపుకొండి .
వచ్చే సమస్యల్ని లెక్కచేయకు...
మీ మాటకు అడ్డుండదు...
మీ నడకకు సాటి ఉండదు...
మీ ప్రతిభకు లోటుండదు...
మీ భవితకు తిరుగుండదు...
కొందరు జీర్ణించుకోలేరు...
కొందరు ఓర్చుకోలేరు....
అయినా మీ నడక మీదే... మీ నడత మీదే....
తొందరపాటులో
పొరపాట్లు చేయొద్దు...
కొందరు నిలదీసి నిప్పులు కక్కుతారు..
పైన బురుద చల్లుతారు...
నిబద్ధతను..మరవొద్దు...
ఇలాంటి వారిని చూపుల నుంచి బహిష్కరించు...
కొత్త పోకడలకు కొత్త దారులు
వేయాలంటే పట్టుండాలి...
మనసును తట్టి లేపే ప్రేరణ ఉండాలి...
ఎదురుచూసే కాలం పోయింది...
ఎదురు తిరిగే కాలమిది...
హింసాత్మక ధోరణి వద్దు...
హంసలా ఉండడమే ముద్దు...
పీడించే హింసను వదిలించు...
ఇదే నేటి తరానికి నిజమైన మంత్రం!!
అందరు మెచ్చిన సూత్రం!!...
కళ్లెదుటే జరిగే నిజాన్ని చూసి
తట్టుకోలేక పట్టుకొని కొట్టలేక
మనసును చంపుకొవడం!!...
ఇంకా ఎన్ని రోజులు??..
ప్రాణాల్ని మానాల్ని
దాచుకొని బతకడం!!...
మనిషిని బంధించినా
మనసు ఆగదు..ఆవేశం నిలవదు
కానీ ఆలోచించి ఆడుగు వేయాలి
నేటి వ్యవస్థను మార్చే విధంగా..!!
అంబటి నారాయణ
No comments:
Post a Comment