Tuesday, November 7, 2023

ఆత్మ బలమును తప్ప ఇంకా దేనిని నమ్మకు! నీకున్న జ్ఞాన, విచక్షణ శక్తితో నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి.

 190223a1205.    200223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀775.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                   ➖➖➖✍️

*జీవితంలో ఎప్పుడైనా ధనముందనో, అధికారం ఉందనో   లేదా జన బలం ఉందనో లేదా ఇంకేదో బలం ఉందనో చూసుకుని గర్వం అహంకారం తలకెక్కి ప్రవర్తించే ముందు ఒకసారి స్మశానం వైపు చూడు.* 

*ఇలాంటి వారిందరినీ తొందరగానే తన దగ్గరికి లాగేసింది.   అక్కడ నీ లాంటివారు ఎందరో   గోతిలో పడుకుని ఉన్నారు. వాళ్ల దుర్గతిని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు.* 

*నువ్వు ఎంతటి గొప్పవాడివైనా స్మశానంలో   గోతిలో  ఎముకుల గూడుగానే ఉండాలి తప్ప నీకోసం అక్కడ ప్రత్యేకమైన పాన్పులేవీ పెట్టరు. నీ సమాధి దగ్గర పచ్చి అన్నం ముద్ద తప్ప పంచభక్ష్య పరమాన్నాలు  ఏమి పెట్టరు!* 

*కనుక భ్రమ నుండి బయటకు రా! జీవిత సత్యం తెలుసుకో! దేవుణ్ణి ప్రేమించడం, లోకాన్ని సేవించడం ద్వారా నిన్ను నువ్వు సాత్త్వికునిగా, పరిశుద్ధునిగా మలచుకో!* 

*ఆత్మ బలమును తప్ప ఇంకా దేనిని నమ్మకు! నీకున్న జ్ఞాన, విచక్షణ శక్తితో నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

No comments:

Post a Comment