Monday, November 6, 2023

నిజమైన ఆరోగ్యం కోసం…

 1711.  1-9.2️⃣.   110223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀103.
*మన ఆరోగ్యం…

           నిజమైన ఆరోగ్యం కోసం…
                  ➖➖➖✍️

 *ప్రస్తుతం ప్రతి ఒక్కరు తాము అనారోగ్యం బారిన పడిన తర్వాత కానీ ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు.

ముందు జాగ్రత్త చర్యల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మరి అందరి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.‌..

ప్రస్తుతం ప్రతిఒక్కరూ డబ్బు సంపాదన కోసం ఇచ్చే ప్రాముఖ్యత మంచి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించు కోవాలి అనే దానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. 

ప్రస్తుతం అందరూ తాము జీవించే తమ జీవనవిధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అంటే తినే ఆహారాన్ని ఏది తినాలి, ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి అనేది, తాగే నీటిని ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి అనేది, నిద్రపోయే సమయం ఎలా ఉండాలి అనేది, శారీరక వ్యాయామం, యోగ చేయడం గురించి సరియైన అవగాహన లేకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

మీరు గమనిస్తే అనారోగ్యాలు ఎలా ఏర్పడతాయి అనేదానికి కారణాలను పరిశీలిస్తే మనకు….  120/80 గా ఉండవలసిన రక్తపోటు 130/85 కన్నా ఎక్కువగా ఉండడం, పొట్ట భాగంలో కొవ్వు అధికంగా చేరడం, వ్యాయామం కొరవడడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఫాస్టింగ్ షుగర్ 100 ఎంజీ కన్నా ఎక్కువగా ఉండడం, లిపిడ్ ప్రొఫైల్లో HDL అంటే మంచి కొలెస్ట్రాల్ 40ఎంజి కన్నా తక్కువగా ఉండడం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువగా ఉండడం.  ఇవన్నీ అనారోగ్యం రావడానికి సహకరిస్తాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు మీలో ఉన్నా మీ భావి జీవితంలో రిస్క్ ఎక్కువ ఉన్నట్లే లెక్క. 

అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించ వలసిన సూత్రాలను తప్పని సరిగా పాటించాలి. ఇవి ప్రివెంటివ్ గా పనిచేస్తాయి.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పంచదార అతి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. లేదా అసలు మానేయడం మరీ మంచిదే. దానికి బదులుగా బెల్లాన్ని వాడుకోవచ్చు. కాఫీలు, టీలలోనే కాకుండా, స్వీట్స్, కేకులు, ఇతర పదార్థాలలో చక్కెర బాగా ఎక్కువగా ఉంటుంది. చెక్కెరను రోజుకు 10 గ్రాములకు మించి తీసుకోకూడదు. అలాగే ఉప్పు అతిగా తీసుకోవడం తగ్గించాలి. నిల్వ ఉన్న పచ్చళ్ళు , ఊరగాయలు వంటి ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించాలి. 

ఫ్రిజ్ లలో కానీ, వండిన తర్వాత ఎక్కువ సమయం నిల్వచేసిన ఆహార పదార్థాలను కాకుండా తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి. 

ఇక రోజుకు 4-5 గ్రాములకు మించి ఉప్పు తీసుకో కూడదు. నూనెల్లో రోజుకు 30 గ్రాముల కొవ్వు పదార్థాలు మించకుండా  ఉండాలి.

కనిపించని కొవ్వు పదార్థాలు బయట తయారు కాబడిన ఆహార పదార్థాలలో, బేకరీ ఫుడ్స్ లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ హైడ్రోజినేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లో, పలుమార్లు కాచబడిన నూనెలలో దేవేసిన బజ్జీలు, వడలు, బోండాలు, బుగ్యాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.

ఇక రోడ్డు పక్కన బండ్లలో అమ్మే పానీ పూరి, బేల్ పూరి, గోబీ మంచూరియా వంటివి, ఫ్యాషన్ పేరుతో హామ్ డెలివరీ చేస్తున్న పిజ్జా, బర్గర్ వంటివి కూడా రోగాల బారిన పడవేస్తాయి. 

అందుకే అలాంటి వాటిని తినడం మానేసి, ఆహారంలో చిన్న చిన్నమార్పులు చేసుకోవడం ద్వారా అనారోగ్యాలను దరిచేరకుండా చూసుకోవచ్చు. రుచిగా ఉంది కదా అని ఏ ఆహార పదార్థాలను కూడా అతిగా తినకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి.

పండ్లు, కాయలు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.  కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలి. వీటితో పాటు తృణధాన్యాలు, సీడ్స్, నట్స్… మెనూలో ఉండేలా చూసుకోవాలి. 

దీంతో పాటు సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి. 

ఏ సమయానికి ఎంత నీరు తాగాలి అనేది కూడా తెలుసుకోవాలి. మనం ఉదయం తాగిన 1-2 లీటర్ల నీరు 11 గంటల వరకూ మన శరీర అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. వీలైతే ఆ నీరు గోరు వెచ్చనిదై తేనె కలిపినదైతే మరీ మంచిది. 

ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీమళ్లీ ఉంటుంది. పగలు తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి, శరీరాన్ని ఎండ నుంచి కాపాడు కోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది.

పగటిపూట మనం రెండున్నర లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఆహారం తినేటప్పుడు తాగడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే మంచిది. 

నీటిని తాగిన తర్వాత 25-30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఏదన్నా టిఫిన్ తినొచ్చు. టిఫిన్ తినేటప్పుడు  నీరు తాగొద్దు. అలాగని టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు దఫాలుగా అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. 

మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు వరకూ నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగొద్దు. అంటే గొంతు పట్టినపుడు గానీ, మాత్రలు మింగడానికి గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు.
ఎందుకంటే తినే ఆహారంతో పాటు నీటిని అధికంగా తాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే బొజ్జ కూడా పెరుగుతుంది. 

ఇక మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2-3 గ్లాసులు గానీ, లీటరు నుంచి లీటరుంపావు వరకూ నీటిని తాగవచ్చు. ఇలా తాగడం వల్ల ఆ నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 

55-60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4-5 గంటలు దాటిన తర్వాత నీరు తాగడం తగ్గిస్తే, రాత్రి వేళల్లో పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సిన సమస్య ఉండదు. 

ఎవరికన్నా రాత్రి 9-10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు. 

ఈ సూచనలు శరీరానికి కావాల్సిన కనీస నీటి అవసరాన్ని తెలిపేవి మాత్రమే.

శరీరానికి పోషక ఆహారం, మంచి నీరు ఎంత అవసరమో, సరైన నిద్ర కూడా అంతే అవసరం. సరైన సమయంలో నిద్ర పోవాలి. 

కనీసం రాత్రి 9-10 గంటలకు తప్పని సరిగా పడుకోవాలి. ఇక ఉదయం కనీసం 5 గంటలకు లేచి వ్యాయామం, యోగ లేదా వాకింగ్, ఆటలు వంటి వాటిని తప్పకుండా ఆచరించాలి. 

నిద్ర 6 గంటలకు తక్కువ కాకుండా 8 గంటలకు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 

నిద్ర ఎక్కువ తక్కువలు కావడం వల్ల బిపి, షుగర్, గుండె పోటు వంటి జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. 

ఇక పోషకాహారం, సరైన నీరు, సరైన నిద్రలతో పాటుగా తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి జీవన విధానాన్ని అనుసరించే వారు ఆరోగ్య వంతులుగా జీవిస్తారని హామీ ఇస్తున్నాను.

ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటివద్దనే పని చేసేవారు సరైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడం లేదు. సరైన సమయంలో సరైన నిద్ర నియమాలను పాటించడం లేదు. అందువల్ల కూడా అనేక రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వీరైతే అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కంప్యూటర్ల ముందు పోరాడి ఎప్పుడో పడుకొని ఉదయం పది గంటల వరకు నిద్రపోతున్నారు. ఇలా సరైన సమయంలో ఆహారం తీసుకోవడం లేదు. సరైన సమయాలలో నిద్రించడం లేదు. ఇక తినే ఆహారాన్ని బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించు కొంటున్నారు. అవి ఎప్పుడు తయారయ్యాయో, ఎన్ని రోజులు నిల్వ చేయబడ్డాయో ఆ దేవుడికే తెలియాలి. దీని ప్రభావం ఇప్పుడు కనిపించక పోయినా భవిష్యత్తులో అనేక రకాల జబ్బులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. జాగ్రత్త సుమా..! 

కాబట్టి మిత్రులారా ! అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో సరైన పద్ధతులను పాటిస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతో, దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…✍️

          _**Rama Bhaktha Guruji.**_
            _**MD in Acupuncture.**_
               _**Cell-8328170075**_

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment