200223a1647. 210223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀776.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మానవుడు ఒక్కడే నిట్ట నిలువుగా నడిచే రీతిలో జన్మించాడు. (ఊర్ధ్వగతికి అర్హత మనిషికి మాత్రమే ఉన్నది)*
*ఎవరిని చూసి ప్రపంచం (ప్రజలు) భయపడదో, ప్రపంచాన్ని చూసి ఎవరు భయపడరో, ఎవరు సంతోషం, కోపం, భయం, మనోవ్యాకులత వంటివి లేకుండా ఉంటారో అట్టివారు భగవంతునికి ప్రియమైనవారు.*
*బాహ్యాంభతర శుచిని కలిగి ఉన్నవారు, కార్య సామర్ధ్యం కలవారు, తటస్థులు, కర్తృత్వం లేని వారు, భగవంతుని యందు భక్తి కలిగిన వారు భగవంతునికి ఇష్టులు.*
*మానవుని ప్రథమ కర్తవ్యం మానవునిగా మెలగటమే. మనిషి మనిషిలాగా ప్రవర్తించాలి మరియు అంతకు మించిన స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించాలి.*
*పెద్ద మనుష్యులు, యోగ్యులు అంటే అర్థం ఏమిటి? ఉన్నతంగా ఆలోచించేవారు, ఇతరుల అభిప్రాయంతో కాక సదాలోచనలతో సదా మెలగేవారు, చెడును తలపెట్టని వారు.*
*ఒక్కోసారి చెడు ఆలోచనలు కూడా మంచి వాటి వలె వినూత్న రీతిలో అనిపించవచ్చు. అయినా వాటిని దూరంగా ఉంచగలగాలి.*
*మనస్సుకు చక్కటి తర్ఫీదుని ఇవ్వనిదే మానవుడు సంతోషంగా ఉండలేడు. ఒకసారి దైవీగుణాలను అలవరచుకుంటే అతనిని ఎవరూ అధిగమించలేరు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment