*Class-9 day*
*ముఖ్యాంశాలు*
**ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం యావత్తు మానవాళికి కూడా కనివిప్పును కలిగించే అంశం. దేనిపైన అయితే ఆధారపడి మానవ జీవితం నడుస్తూ ఉంటుందో.. దేని గురించి తెలుసుకుంటే మన జీవితం ఉన్నఫలంగా పరివర్తనం చెందుతుందో.. అటువంటి అద్భుతమైనటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
అన్ని భయాలకు మూలం ఏది? అది మనల్ని ఎలా నడిపిస్తుంది? దాని గురించి మన తెలుసుకుంటే ఏం జరుగుతుంది? మనం భగవద్గీత రెండవ అధ్యాయంలో ఉంటున్నాం.
ఈరోజు మనం మూడు శ్లోకాలు గురించి మాట్లాడుకోబోతున్నాం.
ఈ మూడు శ్లోకాల్లోని జీవితాన్ని మలుపు తిప్పివేసే అంశం దాగి ఉంది, రహస్యం దాగి ఉంది.
ఎప్పుడైతే అర్జునుడు కళ్ళ నీళ్లు పెట్టుకుని నేను ఇక యుద్ధము చేయలేను, నాకు ధర్మం ఏదో, అధర్మం ఏదో తెలియడం లేదు. నేను నిన్ను శరణాగతి పొందుతున్నాను దయచేసి నాకు బోధింపుము అని అర్జునుడు ప్రాధేయపడినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క శరణాగతిని చూసి, ఇప్పుడే ఇతనికి జ్ఞానం బోధించగలిగినటువంటి సమయం ఆసన్నమైనది. ఎప్పుడైతే వ్యాకులతతో ధర్మసమూడత్వంతో కర్తవ్యమేంటో తెలియక, తనకు తాను సహాయం చేసుకోలేక ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆ సమయంలో జ్ఞానం కోసం, మార్గం కోసం పరితపించుపోతూ భగవంతుని శరణాగతి పొందుతారో అది జ్ఞానబీజం నాటడానికి అవసరమైనటువంటి పనికి వచ్చే సారవంతమైన భూమి అతని యొక్క హృదయం.
ఒక పంట బాగా పండాలంటే నేల సారవంతంగా విత్తనం నాటడానికి చాలా సంసిద్ధంగా ఉండాలి.
జ్ఞానము అన్నటువంటి మహా వృక్షము మొలవాలంటే మనిషి యొక్క హృదయం శరణాగతి తోనూ, అర్థవంతమైనటువంటి వైరాగ్యంతోను ఉన్నప్పుడు మాత్రమే వాడికి జ్ఞానం బోధిస్తే అది చాలా బాగా పనిచేస్తుంది.
సరిగ్గా అర్జునుడు అదే సిచువేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు తన యొక్క జ్ఞాన బోధనను ప్రారంభం చేస్తూ ఉన్నాడు.
భగవద్గీత *అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|*
*గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః||*
రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ప్రారంభమవుతుంది.
సమస్థ ధర్మాలను, ధర్మాధర్మాలు అన్నిటినీ కూడా వదిలేసి ఎప్పుడైతే నన్ను మాత్రమే శరణు పొంది వేడుకుంటావో నీ యొక్క సమస్త పాపములను నేను ప్రక్షాళన చేసి, నీకు దుఃఖాన్ని దూరం చేసి, మోక్షాన్ని కలిగిస్తాను దుఃఖింప వలదు.
చూడండి అర్జునుని యొక్క వైరాగ్యము, అర్జునుని యొక్క విషాదము లోనుంచి, ఏడుపు లోనుంచి భగవద్గీత ప్రారంభమైయెందుకు గాను భూమికాగా ఏర్పడింది.
చెడ్డ జన్మలొద్దు,చెడ్డ జీవితం వద్దు అని ఎవరైతే అనుకుంటారో వారికి ఒకటే ఒక ఛాయస్ ఉంది.
వారిలో ఏదైనా చెడ్డ ప్రవర్తన దాగి ఉంటే, ఆ చెడ్డ ప్రవర్తన తెలుసుకొని, ఆ స్వార్థం గురించి తెలుసుకొని వారిలో ఉన్నటువంటి అన్యాయాన్ని, దుర్మార్గం గురించి తెలుసుకోవాలి... మంచిగా దాన్ని పరివర్తనం చేసుకోవడమే. దీనికి మనకు కావలసింది భగవద్గీత.
అందుకే మనకు భగవంతుడు భగవద్గీత అందిస్తున్నాడు. కాబట్టి ఒక దేహి దేహాన్ని కౌమారాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని పొందుతుందో దేహాన్ని వదిలేయడం.. ఇంకా దేహం పెరుగుతూ బాల్యం, కౌమారం, వృద్ధాప్యం రావడం తర్వాత మళ్లీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సైకిల్ కంటిన్యూగా జరిగిపోతుంది. ఇది అనివార్యము కాబట్టి అర్జున నువ్వు దేహాన్ని మాత్రమే చంపగలవు గాని అందులో ఉన్నటువంటి ఆత్మను కాదు. కాబట్టి ఇక్కడ ఎవరూ చచ్చిపోయే వాళ్ళు లేరు.
దేహాన్ని పొందాల్సిన అవసరం లేకుండా మనం మోక్షజ్ఞానాన్ని పొందాలి. భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలి. ముక్తిని మనం పొందవలసి ఉంటుంది.
ఎప్పుడైతే మనము మనకు జన్మ వద్దు అని.. ఆనంద స్థితిని పొందాలి అనుకుంటే ఈ క్షణం నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఒక గంటలో చనిపోతే నేను ఏం చేస్తాను.. నేను దేనికి ప్రయారిటీ ఇస్తాను.. నేను దేన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాను.. ఏం చేయాలనుకుంటున్నాను.. అని ఎప్పుడైతే ఆత్మ శోధన చేసుకుంటామో అప్పుడు కచ్చితంగా మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది.
ఈ భగవద్గీత నీవు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో నీ లోపల నుండి ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పాడు. ధర్మసంస్థాపన పూర్తి చేయడం కోసం, దుర్మార్గులందర్నీ సంహరించడం కోసం తర్వాత ఆ దుర్మార్గం కాకుండా, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రవర్తనను కలిగించడం ద్వారా ధర్మసంస్థాపన చేశాడు.
No comments:
Post a Comment