కోరికలు - భయక్రోధాలు
✍️ గోపాలుని రఘుపతిరావు
✳️🪷🌹🪷🌹✳️🌹🪷🌹🪷✳️
🪷 అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు♪. అతడే జగత్తుకు ప్రభువు♪. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు♪. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు♪. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి♪? రుషి కోరికలను జయించినవాడు♪. అందువల్ల అతడికి భయక్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు♪. మనిషి కోరికల స్థావరం♪! కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు♪.
🪷 భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిల అంతరిక్షంలో తేలియాడే, అనేక నక్షత్ర గ్రహసముదాయాలు ఉన్నాయి♪! ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉందన్నది ఊహకు అందని విషయం♪.
🪷 జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం (బలం కోల్పోవడం), వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు♪. వార్ధక్య, మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు♪. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు♪. మనిషి సాధన పండించుకుని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది♪. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే♪. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది♪. వెలుగు వెంట నీడలా భయం ఆవహిస్తుంది♪. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది♪.
🪷 కోరికలకు మూలం మనసు♪. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం♪. వైరాగ్య భావన అలవాటు చేయడం వల్ల మనసు మనిషి మాట వింటుంది♪. తర్ఫీదులో భాగంగా రుషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు♪. ఇంద్రియాల (కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం) వల్లే మనిషికి కోరికలు కలుగుతాయి♪. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలు హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి♪. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది♪. కోరికలూ తగ్గుముఖం పడతాయి♪.
🪷 సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గడాన్ని తెలుసుకుంటారు♪. కోరికలు తగ్గించుకున్నవారికి అవి తీరడం లేదన్న మనస్తాపం ఉండదు♪. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు♪. శరీరం జాగ్రదవస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి♪. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు♪.
🪷 రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి సామాన్యులను కలతకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది♪. అటువంటి వ్యాధులు వారికి భయం కలగజేయలేదు♪. చేతకానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది♪. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించినవారవుతారు♪. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ అనందస్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది♪.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
✳️🌹🪷🌹🪷✳️🌹🪷🌹🪷✳️
No comments:
Post a Comment