Friday, April 12, 2024

****_ఒక మనవరాలి కథ_

 *_ఒక మనవరాలి కథ_* 
_(ఆలస్యం చేయకుండా వెంటనేచదవండి...)_
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*

*అనగనగా ఒక డెబ్బైయ్యేళ్ల తాత, ఒక ఏడేళ్ల మనవరాలు. సాయంకాలం ఆ తాత మనవరాలి చిటికెన వేలు పట్టుకుని అలా ఊరి బయట మర్రిచెట్టుకాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి, ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు. 
ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చూస్తుండేది. 
అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది. పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది. టైమే తెలియలేదు. చీకటి పడ్డాక తాతవచ్చి చిటికెన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికొచ్చేది. అలా అలా ఆ మనవరాలికి పన్నెండేండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలూ చదివేసింది. కొత్తపుస్తకం ఒక్కటీ మిగల్లేదు. ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది. తాతయ్యతో పాటు మర్రిచెట్టు కిందే కూర్చునేది.*

*ఒక రోజు చీకటి పడింది. కళ్లు కనిపించని తాత చిటికెన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళుతోంది. ఉన్నట్టుండి తాత ఆగిపోయి, “నేనొక గేయం మొదటి లైను చెబుతాను, నువ్వు దాన్ని పూర్తి చెయ్యగలవా? ఇది అందరికీ తెలిసిన గేయమే!" అని పద్యాల ఆటలోకి దిగాడు.*

*“సరే! అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది.* 

*_“నాకే రెక్కలుంటే....”_* *అనే గేయాన్ని తాత ఆరంభించాడు. మామూలుగా అయితే ఆ గేయం ఇదీ :* 

_‘నాకే రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను_
_అందమైన చోట్లెన్నో చూస్తాను_ 
_గొప్పవారిని కలుస్తాను_ 
_గుప్తనిధులు వెతుకుతాను'_


*ఈ పద్యం మనవరాలికి తెలిసినా..., అప్పటికప్పుడు ఇలా సరికొత్తగా మొదలెట్టి..* 

*_“నాకే రెక్కలుంటే..._* 
*_పక్కూరి గ్రంథాలయానికెగిరి పోతాను_* 
*_మరిన్ని పుస్తకాలు చదివేస్తాను”_* 
*అని చెప్పింది.* 

*ఆ చీకట్లో తాత కళ్లు మిలమిలా మెరిశాయి.*

*ఆ తాత ఆ మనవరాలితో ఆ రాత్రి పక్కమీద ఇలా అన్నాడు. "వంద సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూకార్నెజీ అని ఒకాయన ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని రాయలేదు. ఆ డబ్బుతో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు. నేను అమెరికా అయితే వెళ్ళి చూళ్లేదు గానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతీ గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించిందేనంటారు.*

*నీకు పుస్తకాలంటే ఎంతిష్టమో ఈ గేయాన్ని పూరించడం బట్టి తెలిసింది. నాకు మాటివ్వు. పెద్దదానివైన తర్వాత, నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని ప్రమాణం చెయ్యి."*అని అడిగాడు  ఆ తాత!

*ఆ మనవరాలు అమాయకత్వంగా ఆ తాత చేతిలో చెయ్యివేసింది.*

*ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైంది. 1974 సంవత్సరానికంతా బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి. ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఒక్కటే అయ్యింది.*

*ఇంకా ఇంకా పెద్దదైంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ అయ్యింది, ఆ తాత మనవరాలు.*

*ఆమె పేరు - సుధానారాయణ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు పదివేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చి తాత కలను నెరవేర్చింది.
 సుధామూర్తిగారి కథలో తెలుసుకోవలసింది ఏమిటంటే - కనిపించిన మంచి పుస్తకమల్లా చదవబట్టే ఆమెకి ఐనస్టీన్ ను , న్యూటన్ ను ,  అవగాహన చేసుకునే శక్తి, పుష్టి కలిగాయి. 
ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు. ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ విజయాలు సాధించేది _‘పుస్తకాల పురుగులే’_ అని నిరూపించింది.*
_(—సాకం నాగరాజ)_
*_{"పూలు - పళ్ళు" అనే సంకలన పుస్తకం నుండి సేకరించిన అంశమిది. 🙏}_*
------------------------
*_ఇక ఇప్పుడు ఆ మనవరాలు గురించి మరికొంత సమాచారం.._*

*2024 మార్చి-08, మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి కోటా కింద “సుధా మూర్తి” గారు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.* 

*"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని తనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారు.*

*ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సుధా మూర్తి.. భారతదేశం కోసం పని చేస్తానని చెప్పారు.*******collected from  the  wall  of  vijayakumari mukku

No comments:

Post a Comment