Tuesday, April 1, 2025

 _*📚✍ఏప్రిల్ ఫూల్స్‌ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?*_

🍥ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తారీకున వచ్చే ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆరోజే మరి అందరినీ తుంటరి పనులతో ఏప్రిల్‌ ఫూల్‌ చేసేస్తుంటారు కదా...! కొన్ని సార్లు ఇందులో పెద్దలు కూడా భాగమవుతుంటారు. మరి ఈ ఏప్రిల్‌ ఫూల్‌ అనేది ఎప్పుడు ఎలా మొదలైందో మీకు తెలుసా? 

🍥- రోమన్‌ల కాలం నుంచే ఈ విధమైన సాంప్రదాయం మొదలైందనే ఆధారాలున్నాయి. రోమ్‌లో జరుపుకునే హిల్లరియా అనే ఉత్సవంలో భాగంగా ఇతరులపై జోక్స్‌ వేస్తూ వారిని ఆటపట్టించేవారట. 

🍥- అయితే ఈ ఏప్రిల్‌ ఫూల్స్‌ డేకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఫ్రాన్స్‌లో 1582లో తమ కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్‌ 1 నుంచి జనవరి 1వ తేదీకి మార్చబడిన సందర్భంలో ఆ విషయాన్ని మర్చిపోయిన చాలామంది పాత పద్ధ్దతిలోనే కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించుకునేవారట. అలా మరిచిపోయిన వారిని ఫూల్స్‌ అని పిలిచేవారు. అలా, అక్కడ ఏప్రిల్‌ ఫూల్‌ వేడుకలు మొదలయ్యాయి. 

🍥- ఏప్రిల్‌ ఒకటవ తేదీన జరుపుకునే ఈ ఏప్రిల్‌ ఫూల్స్‌ డేకు 'ఆల్‌ ఫూల్స్‌ డే' అని పేరు.

🍥- 1698లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజున లండన్‌ టవర్‌ వద్ద వందలాదిగా పులులు చంపబడ్డాయనే ప్రచారం జరిగింది. దాన్ని చూడడానికి చాలామందే వెళ్ళారు. అంటే ఏప్రిల్‌ ఫూల్స్‌ అయ్యారనేగా.

🍥- స్కాట్‌ల్యాండ్‌లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డేకు 'హంటిగ్వోక్‌' డే అని పేరు. ఇక్కడి స్కాట్స్‌ భాషలో గ్వోక్‌ అంటే మందమతి అని అర్థం.

🍥- పోలాండ్‌, స్వీడన్‌, డెన్మార్క్‌, నార్వే దేశాల్లో కొంత కాలం అక్కడి మీడియా సైతం ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భంగా కొన్ని అవాస్తవ కథనాలను ప్రసారం చేసేది. 

🍥- ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్‌, క్యూబెక్‌, కెనడా దేశాల్లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డేకు ఏప్రిల్‌ ఫిష్‌ అని పేరు. ఏప్రిల్‌ ఫూల్స్‌డే రోజున ఆడే ఒక ఆటలో భాగంగా ఇతరులకు తెలీకుండా వారి వీపుపై ఒక చేప బొమ్మను అతికిస్తారు. అలా అతికించబడ్డవారు ఏప్రిల్‌ ఫూల్‌ అయినట్టు లెక్క. వారిని ఏప్రిల్‌ ఫిష్‌ అని సంబోధిస్తారు. ఈ ఆటను 'పాయిజన్‌ డి అవ్రిల్‌' అని పిలుస్తారు.

🍥- ఏప్రిల్‌ ఫూల్స్‌ డేను ఏప్రిల్‌ నోడ్డీ డే, గౌకి డే, ఆల్‌ ఫూల్స్‌ మొర్న్‌ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు.

🍥- 1960లో స్వీడన్‌కి చెందిన ఒక టీవి ఛానల్‌.. ఒక నైలాన్‌ గుడ్డతో టీవీ సెట్స్‌ని తుడిస్తే రంగుల్లో చిత్రాలు ప్రసారం అవుతాయంటూ ప్రకటన చేసింది. అప్పట్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలే ఉండేవి మరి. ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజున వీక్షకులందరూ అలాచేసి ఏప్రిల్‌ ఫూల్‌ అయ్యారు మరి.

🍥- 1392లో చౌసెర్‌ రాసిన 'క్యాంటర్‌బరి టేల్స్‌లో సైతం ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజున చిన్నారులు చేసే చిలిపి, తుంటరి పనుల ప్రస్తావన ఉంది. 

🍥- దాదాపు అన్ని దేశాల్లో ఏప్రిల్‌ ఫూల్స్‌డేను మధ్యాహ్నం వరకు నిర్వహిస్తారు. అయితే అమెరికాలో మాత్రం రోజు మొత్తం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేను జరుపుకుంటారు.

🍥- కెనడా, ఇంగ్లండ్‌ దేశాల్లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డేను మధ్యాహ్నం వరకే జరుపుకోవాలనే నిబంధనలున్నాయి. 

🍥- 1950 స్పాగెటి(మైదా, గోధుమతో చేసే ఒక పదార్థం) ఒక రకమైన మొక్క ద్వారా లభిస్తుందంటూ దీన్ని దక్షిణ స్విట్జర్‌ల్యాండ్‌లో సాగుచేస్తున్నారంటూ ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజున బిబిసి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ తర్వాత వందలాది మంది ఈ మొక్కల కోసం బిబిసిని సంప్రదించారు. ఇప్పటి వరకు అంత పెద్ద సంఖ్యలో అందరినీ ఏప్రిల్‌ ఫూల్స్‌ చేసింది ఈ కథనం మాత్రమే.

No comments:

Post a Comment