Thursday, April 3, 2025

****ఆమె.!* *(ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం,* *ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)

 *ఆమె.!*
*(ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం,*
*ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)*

*ఖుషీ పాటలో ఆమె అడిగింది, పసిఫిక్ సాగరం ఈదుతావా ఎవరెస్టు ఎక్కిస్తావా ?అని, అందుకోసం నువ్వు స్వర్గాన్ని సృష్టిచేసి, కైలాసాన్ని దించక్కర్లేదు. ఎందుకంటే ఆమెఅవి అడగదు, నువ్వివి ఇవ్వలేవు.*

*ఆమె వండితే, నువ్వు తోము, ఆమె ఉతికితే, నువ్వు మడతెట్టు,*
*ఆమె తుడిస్తే, నువ్వు తడిగుడ్డపెట్టు, ఆమె పెడితే, నువ్వు తిని బాగుందని ఒక మాటను, నువ్వు తినేముందు, ఆమెని తిన్నావా అని అడుగు.*

*రొక్కం పది ఉంటే రోజాకొను, అదే పదిలక్షలుంటే పసిడి కొను, ఆమెకి రెండూ ఇష్టమే,*

*ఆమె అలసిపోతే కాళ్లు పట్టు, అలక వస్తే కన్నీళ్లు తుడు, ఆమెకివింకా ఇష్టం.*

*ఆమెకోసం ఏదైనా నేర్చుకో, దాన్నొక సర్ప్రైజ్గా ఇచ్చుకో. ఆమె కోపం వెనక కారణం తెల్సుకో, చెప్పలేదని మిన్నకుండటం మానుకో.*

*కండఉందని ఆమెని కొట్టేవు, ఆ కండలవెనక నీ గుండె ఒక బండయ్యేను,*

*నాలుకుందని ఆమెని తిట్టేవు, నరకానికది ద్వారం తెరిచేను. నీకోరిక తీర్చేందుకు ఆమె లేదు, అదే కోరిక తీరినాక ఆమెని పక్కకి తొయ్యకు,*

*అడిగి ముందడుగువెయ్యు, మురిపెం పంచి ముద్దించు. మంచం ఇద్దరిదీ అని మదిలో ఉంచు.*

*ఆమెకున్న, ఆమెకి నువ్విచ్చిన గౌరవం నీకు నువ్విచ్చుకునేది, నీకున్నది, నువ్వెప్పుడూ పిలవనిది ఆమె తగిలించుకోవాల్సిన*

*అవసరం లేనిది నీ ఇంటిపేరు, ఆమె అస్తిత్వమే, నీ పేరు ప్రతిష్ట, ఆమె స్వేచ్ఛే, నీ స్వాతంత్ర్యం.* 

*ఆమె తెచ్చుకున్న రూపాయి నీదనుకోకు, ఇస్తే కాదనకు, కాదంటే ఇంకెవ్వరికీ ఇవ్వకు, అడిగి తీసుకుంటే మళ్లీ ఇచ్చెయ్యి,*

*అర్థం, అర్ధం రెండూ ఆమే అని గుర్తించు.కుచ్చిళ్లు సర్దు, కుర్చీలు సర్దు, చెవి దిద్దులు మెచ్చు, చేతిసాయం పంచు...*

No comments:

Post a Comment