*🙏🌹 పద్మావతి అమ్మవారి హారతి🌹🙏*☝️
*సరదాగా*
మన తెలుగు 🙂
*ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు. అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు.*
*ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడవుందో కనపడక వెతుకుతూ, "నా చరవాణి ఎక్కడ? చరవాణీ ఎక్కడున్నా వే?" అని గట్టిగ అరుస్తూ వుంటే,*
*కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా "చరవాణా, అదెవత్తీ?" అంటూ చేతిలో గరిటతో సహా వచ్చింది.*
*"అదేనే కనకం! నా సెల్ ఫోను"*
*అలా అఘోరించ వచ్చుగా! మీ చొక్కా జేబులో వుంది, అనిచెప్పి వెళ్లిపోయింది.*
*వెంటనే తెచ్చుకొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరూ? అన్నాడు*
*నేను బావా! రమాపతిని. మా అబ్బాయి గణపతికి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ, చెల్లి తప్పకుండా రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను.*
*సరే వస్తాంలే బావా! అని సెల్ పెట్టేసి, కనకం! యిటురావోయ్ అని భార్యను పిలిచాడు.*
*మీ అన్న కొడుకు ఉపనయనం అట. తప్పక రమ్మన్నాడు. అంచేత 'దరిద్రరథం'లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణిలో చేప్పేయ్ అన్నాడు.*
*కనకం నెత్తి కొట్టుకుంటూ "మీ భార్య నైన పాపానికి 'దరిద్ర రథం' అంటే 'గరీబ్ రథ్' అనీ 'శయనాలు' అంటే 'బెర్త్స్' అనీ అర్థమయింది. ఆ పుస్తకం చెయ్యడమేమి టో? ఆ సంతోష ప్రయాణాల వాడెవడో? మీరే వివరించండి".*
*"అదేనే! మన వెనక వీధిలో ఉన్న ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు.*
*ట్రైన్ ఎక్కి కూచున్న తర్వాత, "కనకం! అసలే నీది ద్విగవాక్ష శయనం, మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త" అన్నాడు ఉమాపతి.*
*"ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ?" అంటే "సైడ్ లోయర్ బెర్త్" అని వివరించాడు.*
*కనకం నిట్టూర్చి "నా రవ్వల గాజులూ, చంద్రహారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చివచ్చాను. మిగతావి నా బాగులో జాగ్రత్తగా వున్నాయిలెండి" అంది.*
*"అయ్యో! ఏ లెక్కాపత్రం లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే? రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే? అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ, పరిభ్రమణ బోతూనూ" అన్నాడు.*
*"పానబోతూ, పరిభ్రమణబోతూ ఏమిటండీ?" అంటే*
*"తాగుబోతూ, తిరుగుబోతూ" అని వివరించాడు ఉమాపతి.*
*"మహానుభావా! ఇంగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు కూడా పర్యాయపదాలు కనిపెడుతున్నారా?" అని తల బాదుకుంది.*
*అది సరే కానీ! మనకు ఆ తెలుగుఖాతా కార్యాలయంలో తాళపేటిక ఒకటి విలపించింది కదా! అందులో పెట్టి రావలిసింది అన్నాడు.*
*కాసేపు ఆలోచించి "ఓహో! ఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడిచింది కదా!" అని అర్థం చేసుకొని "మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు కదా!" అని దబాయించేసరికి నోరు మూసుకొని పడుకున్నాడు.*
*పొద్దున్నే హైదరాబాద్ చేరారు.*
*మీ అన్న చతుశ్చక్రవాహనం(కారు) పంపిస్తానన్నాడు. పంపలేదు చూశావా?" అని సరే "ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదాం" అంటూ(ఆటో) మాట్లాడాడు.*
*ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి "దరిద్రరథంలో వస్తానని దూరవాణిలో చెప్పాను కదా! చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ?" అని బావమరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూవుంటే కనకం వివరించింది.*
*"సారీ బావా! మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు. సమయానికి కారు యింట్లో లేదు" అన్నాడు రమాపతి.*
*ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి, కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై, నేను పెళ్లిమండపంలోకి వెళ్తున్నాను" అంటూ, త్వరగా తయారై వెళ్ళిపోయింది.*
*ఉమాపతి తయారై "అరే నా ఉపలోచా నాలు(కళ్ళజోడు) ఎక్కడ?" అని కళ్ళ జోడు కోసం వెతికాడు. కనపడలేదు.*
*అలాగే తడుముకుంటూ మండపంలోకి వెళ్ళాడు. అంతా మసకమసకగా వుంది. ఎవరూ సరిగ్గా కనపడడం లేదు.*
*భార్య కోసం వెతుకుతున్నాడు.*
*'కనకం ఎక్కడుందీ?' అనుకుంటూంటే, అక్కడే కనకాంబరం చీర కనపడింది. అదిగో కనకం ఇక్కడేవుంది అనుకుంటూ వెళ్లి కొంగుపట్టుకొని లాగాడు.*
*ఆవిడ ఉమాపతి గూబ గుయ్యిమని పించింది. "ఏమిటీ తిక్కతిక్కగా వుందా?" అని అంటే*
*ఏమైందంటే నా ఉపనయనాలు కనపడలేదు" అని ఉమాపతి ఏదో చెప్పబోతూంటే*
*ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని "ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనబడలేదంటా వేమిటి?" అంటూ కొట్టబోతుంటే,*
*కనకం చూసి పరిగెత్తుకొచ్చి ఆపి "అన్నయ్యగారూ!ఆయన మా ఆయనండీ క్షమించండి. ఏదో పొరబాటు అయింది" అంటూ "ఏమిటండీ! ఇదీ" అంటే,*
*కనకం, నీవు కనకాంబరం చీర కదా! కట్టుకుంది. చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే?" అన్నాడు*
.
*"అబ్బా! ఫంక్షన్ లో గంటకొక చీర మారుస్తాము. ఇంతకీ ఉపనయనా లేమిటి?" అంది.*
*నా కళ్ళజోడు కనపడలేదు అన్నాడు ఉమాపతి.*
*కనకం నెత్తి బాదుకొని "నిన్నరాత్రి రైల్లో నాబాగులో పెట్టారు కదా!" అని తీసి కళ్ళకు తగిలించి, అందరికీ సారీలు చెప్పి వెళ్ళింది.*
*ఊరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావగారిని ఆటపట్టిస్తూ "బావా! ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో! అంటే స్పేర్ కళ్ళజోడు అన్నమాట అన్నాడు.*
🙏🌹🌴🪔😊🪔🌴🌹🙏
No comments:
Post a Comment