Tuesday, April 1, 2025

 ఏ దేవత నామం స్మరిస్తే ఆ నామ సంబంధిత దేవుడు ఒక్కరే పలుకుతాడు. కానీ,
*శ్రీ రామ జయ రామ జయ జయ రామ.* అని ఒక్కమారు స్మరిస్తే ...శ్రీరాముడొక్కఈ నామం లో  పలుకుతాడు అనుకోడం తప్పు.. ఈ మహిమాన్వితమైన *శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అని  ఋషులు పురాణాలలో చెప్పారు.అదెలాగంటే...?!
రామ అని స్మరిస్తే *రాముడు* మాత్రమే పలుకుతాడు ఈ విషయం జగద్విఖ్యాతం. 
రామ అనే నామం స్మరించినా బిగ్గరగా ఉచ్చరించినా ఆ ప్రదేశంలో అంతర్లీనంగా అందరికంటే అతి శీఘ్రముగా ఆ నామ శబ్దాన్ని,ఆ నామాన్ని  మనస్ఫూర్తిగా విని ఆనందించేది నిస్సందేహంగా  * హనుమ* మాత్రమే.
*శ్రీ* అనగా *లక్ష్మి*
 *రా* అనగా *విష్ణువు* ( *ఓం నమో నారాయణాయ* అనే అష్టాక్షరీ మంత్రం నుంచి *రా* అనే జీవ అక్షరం తీసుకున్నారు)
*మ* అంటే *శివుడు* (*ఓం నమః శివాయ* షడాక్షరీ మంత్రం నుంచి *మ* అనే జీవ అక్షరం తీసుకున్నారు)
ఈశ్వరుడు హనుమంతుని రూపంలో భూలోకానికి రామ సేవార్ధం  వేంచేస్తుప్పుడు పార్వతీ దేవికి ఆ విషయం తెలిసి, 'నాకూ రామ సేవాద్భాగ్య  కావాలి' అని అడిగింది.  అపుడు శివుడు ..'నా ఈ హనుమ అవతారం లో  బ్రహ్మచర్యాని పాటిస్తాను కదా! అందువల్లనే నాతోపాటుగా నిన్నూ తీసుకెళ్లడం  శాస్త్ర విరుద్ధం.' అన్నాడు.
 అపుడు పార్వతీ దేవి  ఇలా అన్నది.' నేను మీలో, మీతో, వాలంలో (తోక రూపం)కలిసిపోయి వస్తాను.' అని హనుమంతుని తోకలో అంతర్లీనమైపోయిందట. అందుకే, *రామ* అన్నపుడు హనుమతో పాటుగా  *పార్వతీదేవి* కూడా వచ్చినట్లే అర్ధం కదా..!?
షట్ దేవతా స్వరూపాలు ఆ మూడక్షరాలు..
*రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ*
ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతల  ఆశీర్వచనాలు లభించినట్లే.
అందుకే, ప్రతి ఒక్కరూ నిత్యం *శ్రీరామ* నామ పారాయణం చేయడం అలవాటు చేసుకోండి..
*శ్రీరామ రక్ష సర్వకాల జగద్రక్ష*
*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీమహస్వామివారు*

No comments:

Post a Comment