Tuesday, April 1, 2025

  *అనగనగా...*

అవంతీనగరంలో అరవై సంవత్సరాలు నిండిన వారిని చంపేయాలనీ రాజ్యం పరిపాలించే రాజు ఆజ్ఞ జారి చేసాడు…వృద్దులు పని చేయలేరు…వాళ్ళ ఉపయెాగం లేదని అతని భావన….అంతే కాదు పాత వస్తువులు వుండ కుడ దనీ…అవి శని కి సంకేతం అని కుాడ జారి చేసాడు…శని వుంటే రాజ్యానికి అరిష్టం అని భావించేవాడు…!

రాజ్యం లో చాలామంది తమ పుార్వీకుల జ్ఞాపకం గా దాచుకున్న పాతవిలువైన వస్తువులు విసిరి పారేయలేక …చాలా మనస్తాపం పొందేవారు…!!

కావున ఆ రాజ్యం లో వృద్దులు కానీ పాత వస్తువులు కానీ కనపడవు..శాంతమ్మకి ఈ మధ్య 60వ సంవత్సరం వచ్చింది … ఆమె కొడుకులు ఆమెను ఒక చోట రహస్యం గా భటులకి కనపడకుండా దాచి వుంచారు.

ఒకనాడు అడవిలో సింహం ఒకటి ఊరిమీద పడి దొరికిన వారిని దొరికినట్లు దాడి చేయసాగింది.ప్రజలు భయబ్రాంతులైనారు.సింహఽ గర్జిస్తుా ఊరంతా …అడవిలో తిరిగినట్లు తిరుగుతుంది .ప్రజలు కు ఏమి చేయాలో తొిచలేదు…దాన్ని అడ్డుకోవడానికి వెళ్లి నభటులను అది దుాకి చంపేసేది.

శాంతమ్మ కి విషయం తెలిసింది.కొడుకుల్ని పిలుపిచ్చుకొని సింహం పీడ విరగడ కావలంటే…సున్నం నీళ్ళ లో ముంచిన మేకపిల్లను ఆహారం గా వేయమనీచెప్పిఽది…కొడుకులు ఆ పని చేసారు..ఆకలితో వున్న సింహం అమాంతం మేక పిల్లను తినేసింది. అది సున్నం తిన్నందు వలన కళ్ళు తిరిగి సృహ కొల్ల్పోయి పడిపోయింది …అప్పుడు భటులు వచ్చి దాని మీద వల వేసి పట్టుకొని భోనులో పెట్టారు.

ఇంత మంచి సలహా ఇచ్చిందెవరనీ రాజు విచారించాడు….శాంతమ్మ రహస్యంగా దాగిన విషయం తెలిసి రాజు ఆమె తెలివి కి మెచ్చుకొిని పెద్దలను వృద్దులను చంపకుడ దని…వాళ్ళ సలహాలు సుాచనలు అనుభవాలు విలువైనవనీ వృద్దుల అవసరం ఎంతో వుందని …వృద్దులను చంపే శాసనం రద్దు చేయించాడు…

అంతే కాదు….పుార్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయెాగపడతాయనీ దాచుకోమనీ రాజు ఆఙ్గ జారీ చేసాడు…!!

జీవిత సారం అంతా రంగరించి మంచి సలహాలు ఇవ్వగలిగేది పెద్దలే సుమా !!!

No comments:

Post a Comment