*♨️మానసిక ఒత్తిడిలో యువత……*
❈──────🎀─────❈
*_☛పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధిక సమస్య_*
*_☛ఊబకాయంతో హృద్రోగ ముప్పు_*
*_☛యంగ్‌లైవ్స్ ఇండియా అధ్యయనంలో వెల్లడి_*
❈──────🎀─────❈
*_🌍ఈనాడు, హైదరాబాద్: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు తదితర కారణాలతో యువత మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతోందని యంగ్‌లైవ్స్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. గత నాలుగైదేళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక అనారోగ్య లక్షణాలు పెరుగుతున్నాయని తెలిపింది. సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 59 శాతం మంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై ఈ అధ్యయనం నిర్వహించారు._*
*_✍🏻నివేదికలో వెల్లడైన అంశాలివీ..._*
━━━━━━━━━━━━━━━━━━━━
*_➯ఏపీతో పోలిస్తే తెలంగాణ యువతలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత వర్గాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఈ పరిస్థితులు ఎక్కువ._*
*_➯పేదరికం, తల్లిదండ్రుల్లో తక్కువ అక్షరాస్యత, వెనుకబడిన, అణగారిన వర్గాల కుటుంబాల్లోని యువత ఎత్తుకు తగిన బరువు లేక బలహీనంగా ఉన్నారు. ఆహార అభద్రత పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చదువుకున్న, ధనిక కుటుంబాల్లోని యువతలో ఊబకాయం లక్షణాలున్నాయి._*
*_➯పోషకాహార సమస్యలున్న కుటుంబాలు 38శాతం ఉన్నట్లు వెల్లడైంది._*
*_➯ఎత్తుకు తగిన బరువులేని యువత, అదే సమయంలో అధికబరువుతో బాధపడుతున్న యువత సమానంగా ఉన్నారు._*
*_➯యువతలో మధుమేహం, గుండె సంబంధిత తదితర నాన్‌కమ్యూనికబుల్ వ్యాధుల కారణంగా మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది._*
*_➯22 ఏళ్ల యువతలో 21 శాతం మంది, 29 ఏళ్ల యువతలో 13 శాతం మంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితులు యువతలో హృద్రోగœ సమస్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయి._*
*_➯తెలంగాణలో హృద్రోగ సంబంధిత ముప్పు 22 ఏళ్ల యువతలో 7.94 శాతం ఉంటే.. 29 ఏళ్ల యువతలో 15.51 శాతం ఉంది. ఏపీలో 22 ఏళ్ల యువతలో 9.22 శాతం ఉంటే.. 29 ఏళ్ల యువతలో 22.73 శాతం ఉంది._*
*_➯మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు 2021లో ప్రతి లక్ష మందిలో 1974 మంది ఉంటే.. ఇప్పుడు మరో 11 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది._*
*_➯సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 15 శాతం మందిలో స్వల్ప, మధ్యస్థాయి మానసిక ఆందోళన, నిరాశ లక్షణాలు కనిపించాయి. వీరిలో ప్రతి పదిమందిలో ఆరుగురు సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనం గుర్తించింది._*
No comments:
Post a Comment