మనసు బాగుంటే మనిషి బాగుంటాడు
మన ఇంట్లోని మనం భోజనానికి వాడే గిన్నెలను వంటకు వాడే వంట పాత్రలను ఎలాగైతే నిత్యం సుబ్రపరచుకుంటామో మనసును కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి
ఇంటిని రోజు ఎట్లా అయితే దుమ్ము ధూళి లేకుండా ఊడ్చుతామో అలాగే మనసును శుద్ధి చేసుకోవాలి
యిపోలిక సరియైనదో కాదో నాకు తెలియదు కానీ దీని లో దాగి ఉన్న సత్యం గ్రహించాలి
తిని కడగకుండ వదిలేసిన కంచంలో మళ్ళీ మనం ఎలాగైతే మళ్ళీ భోజనం చేయలేమో
బాగా దుమ్మూ దూలి పేరుకున్న ఇంటిలో ఎలాగైతే నివాసం ఉండలేమో
అలాగే అనవసరమైన ఆలోచనలు ,ప్రతికూల భావాలు , చెడు తలంపుల తో మనసు నిండిపోతే మన జీవితం దుర్బరమవుతుంది
మనసును కొందరు భక్తి మార్గం ద్వారా శుద్ధి చేసుకుంటారు
ఉదాహరణ
భజన , స్మరణ , ప్రాథ్ ధన పూజ
మరికొందరు జ్ఞాన మార్గం ద్వారా శుద్ధి చేసుకుంటారు
ఉదాహరణ
గ్రంథ పఠనం సర్జన సాంగత్యం మంచిని మననం చేసుకోవడం లాంటివి
No comments:
Post a Comment