Thursday, April 3, 2025

 *_"ఇంద్రాక్షీ త్రిపాఠీ"... ధైర్యం, ప్రేమ, త్యాగానికి మారుపేరు_*
_(ఈమె పెళ్ళికథ గురించి తెలుసుకోవాల్సిందే..!)_
 🙏🙏🙏🙏🙏🙏🙏

*ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌... గతవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ తాలూకు టేకన్‌పూర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లూ చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె..? ఏమిటామె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే చదవాల్సిందే!*

*"ఇంద్రాక్షీ త్రిపాఠి..." ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టముండదు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ సందీప్‌ మిశ్రా భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం సందీప్‌ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు. భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనేం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా.. బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె కళ్లతో భర్తకు లోకాన్ని చూపిస్తూ... ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతోంది. ఒక పాపకు తల్లిగా, సందీప్‌ సంరక్షకురాలిగా నిత్యం కాచుకునే ఇంద్రాక్షి గొప్ప మనసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ కొట్టకుండా ఉండరు.* 

*అందుకే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా టేకన్‌పూర్‌లో పని చేస్తున్న సందీప్‌ మిశ్రా అర్థాంగి గురించి తెలుసుకున్నాక, వెంటనే ఆమెకు అభినందనలు చెప్పాలనుకున్నారు. వారింటికి వెళ్లి కోరి మరీ ఆతిథ్యం అందుకున్నారు.* 

*ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో ఉన్న బన్సీ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిందామె. తండ్రి ఆప్రాంతంలో పేరున్న న్యాయవాది. సంపన్న కుటుంబం, పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. బీఏ ఆ తరవాత పీజీ పూర్తి చేసింది. అంతేకాదు.. తైక్వాండో ఛాంపియన్‌ కూడా.*
-------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment