ఒక తండ్రి కొడుకుతో చెప్పాడు..
"నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండు కన్నా" అని..
అప్పుడు కొడుకు తండ్రికి జవాబు ఇచ్చాడు..
" మీరు జాగ్రత్తగా నడవండి నాన్నా,
నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను" అని..
ఇదే జీవితసత్యం..
పిల్లలెప్పుడూ తల్లితండ్రి చెప్పే సలహాలు, సూచనలను పట్టించుకోరు,
వారికి అర్ధం కూడా కాదు,..
వారు ఎక్కువగా చేసేది తల్లితండ్రి చేసే పనులను అనుసరించడం,
వారు చేసే పనులకు తల్లితండ్రిని ఉదాహరణగా తీసుకోవటం..
అంటే ఫోన్ ఎక్కువగా చూడకు అని పిల్లలను మందలించిన, తల్లితండ్రి, తామే ఫోన్ చూస్తూ ఎక్కువ సమయం గడిపితే,
పిల్లలు వారి మాట వినరు..
అదే ఒకవేళ తల్లితండ్రి,
ఫోన్ పక్కనపెట్టేసి,
పిల్లలతో కబుర్లు చెబితే,
పిల్లలు కూడా, వారి మనసులో మాటలు,
తల్లితండ్రితో పంచుకుంటారు..
ఇలా తల్లితండ్రి చేసే పనులే,
పిల్లలూ సహజంగా నేర్చేసుకుంటూ ఉంటారు..
కాబట్టి తల్లితండ్రి అడుగులు తడబడకుండా ఉంటే పిల్లల నడక, నడత కూడా తడబడకుండా బావుంటుంది🙏
అన్నమనేని శ్రీనివాసరావు
No comments:
Post a Comment