🌸🌸🌸🌸
ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే..._*
*_సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన జీవి మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు._
*_కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే... మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే._
*_అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరో చోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి. ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు._
*_రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు._
*_ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది...
No comments:
Post a Comment