Tuesday, April 1, 2025

 విధిజ్ఞ పడీ పడీ నవ్వుతోంది. ఆమె అలా నవ్వటం ఇది రెండవసారి. 

అలాగని చిన్న పిల్ల కాదూ, తక్కువ వయసూ కాదు. రెండు పదులు దాటి ఐదు వసంతాలు అయింది. అంటే పాతికేళ్ళు అన్నమాట. 

మొదటి సారి స్పృహలో ఉండీ, పైకి చిరునవ్వు చూపిస్తూ, లోపల పడి పడి నవ్వింది మనసులో.

ఇప్పుడు రెండోసారి స్పృహలో లేదు. కానీ నవ్వుతోంది. మనసులో. హద్దులు లేని నవ్వు అంత మెరుగని నవ్వు కల్మషం ఎరుగని నవ్వు. 

క్లుప్తంగా చెప్పాలంటే, మానవత్వం అయిపోయిన మనసులో, ఇంట్లో పుట్టిందామె.

తల్లికి ఎంతసేపు అందరూ తనని పొగడాలి. తండ్రి సరే సరి, భార్య చెప్పు చేతుల్లో ఉంటే చాలు. భర్త అన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఆమెకు అది పెద్ద విషయమే కాదు. అయితే ఈ అణిగిమణిగి ఉండటం అనేది పైపైకి. 

లోన మాత్రం అతని కనిపించని రాక్షసత్వం లోకానికి తెలియదనీ, ఆమె మానసికంగా, అభిమానపరంగా పడుతున్న నరకం కనీసం తన తల్లికి అతని తల్లికి కూడా తెలియదని చాలా క్షోభ ఉంది. ఈ శోభా ఆ బాధ మిగతా ఆడపిల్ల జీవితాలతో పోలిస్తే ఏమిటి కాస్తంత ఎక్కువే. ఎందుకంటే అతను పెట్టి కష్టం కూడా అలాంటిదే మరి. 

"అతను కపటి కదా", అని ఆమె మనసు తల్లడిల్లి పోయేది, విలవిలలాడిపోయేది.

ఈ రోౙుల్లో చెప్పబడే So-Called gas lighting చేయటంలో చాలా దిట్ట అతను. పదాలు లేకపోవచ్చు కానీ గుణాన్నిదేముంది. అందుకని అతను సమర్ధులను చెప్పవచ్చు ఆ విషయంగా. ఇక ఆమెకు ఆ రోజుల్లో ఆ పదం తెలియకపోయినా అతను చేసేవన్నీ కాబట్టి మానసికంగా బాధ పడటం లో అర్థం ఉంది.

కనీసం పిల్లలు పుడితే మార్పు వస్తుంది అని అందరిలాగా ఎదురు చూసి బాబు పుట్టాక వచ్చిన ఆ కాస్త మార్పు చూసి మురిసిపోయింది. 

అది కాస్తా, రెండవ కాన్పు పాపను చూశాక మళ్ళీ వెనక్కి వెళ్ళి పోయింది. అంటే వందన భర్త పాపాలరావుకు మళ్లీ శాడిౙం, రాక్షసత్వం తిరిగి వచ్చేసాయి.

దానితో విధిజ్ఞ తల్లి వందనకు తనకు తెలియకుండానే పాప మీద ఒకలాంటి కసి, ద్వేషం ఏర్పడ్డాయి. 

ప్రతి చిన్న విషయానికి ఆ కూతుర్ని పక్క ఇంటి వాళ్లతో పోల్చి చూడటం, చెరుకైన తన అన్న కూతురు తోటి, ఇతరుల తోటి ఆ పోలిక పెట్టి గుచ్చి గుచ్చి మనసులో పెట్టుకోవడం ఒక వ్యాపకం అయిపోయింది. 

ఆ వ్యాపకం ఎంత అంటే, పూజకి ఒకళ్ళు పూలు మాత్రమే కోస్తారు ఇవి మాల కడితే అష్టోత్తరానికి మాల ఎందుకు ఉంటుంది. అన్నది కదా అని ఈసారి మాల కట్టకుండా, విడిపూలే అది చేమంతుల వంటివి తీసుకువచ్చినా, "నీకు పని వైనం తెలియదు, అమ్మ అవసరం తెలియదు, అంకితభావం అసలే లేదు, అదిగో దాన్ని చూసి నేర్చుకో", అంటూ ఉండేది.

చదువుల తల్లి విధిజ్ఞ, కొంచెం పట్టి బొమ్మ వేసింది అంటే, సజీవ కళే అది.

తల్లి రాక్షసత్వం ఎరిగి, అందువల్ల మనసు విరిగి, ఇక జగన్మాత అంటే కూడా నమ్మకం లేదు కానీ, పోటీలలో ఒకసారి ఆ బొమ్మ వేయమని ఇస్తే వేసినప్పుడు మాత్రం సాక్షాత్తు అమ్మవారు కూడా జాలి కరుణా దయ తనపై చూపిస్తున్నట్లుగా ఉంది.

"ఇంత బాగా ఎలా వేశావు", అని బహుమతి ప్రదాతలు వేదిక మీద అడిగినప్పుడు, "నేను ఈ జగజ్జననిలో లేదనుకున్నది ఉంటే బాగుండు అనుకున్నది ఊహించుకుంటూ వేశాను అంతే అని చెప్పింది". 

14 ఏళ్ళ ఆ పిల్ల కష్టం ఏమిటో వాళ్లకి తెలియదు కానీ, చెప్పిన విధానానికి మాత్రం చలించిపోయారు. 

వాళ్లలో ఓ చిత్రకారిణి, నీ కళకు నేను గుర్తింపు నింపుతాను అంటూ, ఆమె తనతో పాటు ప్రదర్శనలకు తీసుకుని వెళ్ళేది. 

ఇంట్లో ఒప్పుకోరు అన్న వినేది కాదు. ఆవిడ పేరు ప్రకృతి. తను కోరిన జగన్మాత పేరు కూడా ప్రకృతియే కదా, ఇది నిజంగా ఆవిడకరినైనా అని ఆశ్చర్యపోయేది విధిజ్ఞ. కానీ ఈ ప్రవాహంలో పడి విదిజ్ఞ చదివిన నిర్లక్ష్యం చేయలేదు సరి కదా మరింతగా మంచి మార్కులతో ముందుకు దూసుకుపోయి చక్కగా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసేసింది.

ప్రకృతికి అయితే విధిజ్ఞ మగ పిల్లలు లేరు కానీ, తన కజిన్ గౌతమి కొడుకు కపర్తికి తని దగ్గరుండి సంబంధం మాట్లాడి పెళ్లి చేసింది ప్రకృతి. 

ఎందుకంటే, ఆ సరికే, ప్రకృతికి విదిజ్ఞ తల్లి వందనం ప్రవర్తన అర్థం అయపోయింది.

ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం రావటము, అటు మంచి సంబంధం కుదరటమూ, ఆ సంబంధం విరిగిన కోరుకున్నట్టు తన తల్లిదండ్రులు ఉన్న ఊరిలో కాకపోవటము వల్ల ఇదిజ్ఞ మనసుకు కొంత ఊరట చెందింది.

ఇక్కడ విధిజ్ఞకు మొదటిసారిగా నవ్వు వచ్చింది.

అన్నాళ్ళూ చిత్రకారునిగా తిరుగుతూ ఉన్నప్పుడు, ఇంటిపట్టున ఉండట్లేదునో, ఆడపిల్లగా అనుకోలేదు అనో, బయటి వాళ్లతో తిరుగుతున్నానో, వీటిల్లో పడి చదివును నిర్లక్ష్యం చేస్తున్నావనో, కళలు కూడు పెట్టవనో, రకరకాలుగా పాపాలు రావు విదిగినను వేధిస్తూనే ఉండేవాడు. 

తల్లిగా తను వేధించకపోయినా, అడ్డుపడేది కాదు. ఎందుకంటే, ఆమె కూతురు బాగును ఎప్పుడూ కోరలేదు. కనుకనే కూతురు నిజంగా చెడిపోయిన పట్టించుకునేది కాదు. 
కాకపోతే, భర్త పాపాలరావు తిడుతున్నప్పుడు మాత్రం, తనకు భర్త పట్ల అలవాటైన విధేయత చూపుతూ, కూతుర్ని ఏ రకంగానూ సమర్థించేది కాదు, వెనకేసుకు వచ్చేది కాదు. 

అది "పైకి" భర్త పట్ల విధేయతే అయినా, మనసులో మాత్రం మాలిన్యమే. "తనకు శత్రువు అయిన కూతురుని భర్త తిట్టడం తప్పు పట్టడం ఆమె ఎంతగానో" ఆస్వాదించేది. 

ఏదైనా తనది కానీ రోజున విధిజ్ఞ అనారోగ్యంతో బాధపడుతుంటే, "లోకం ముందర" సేవలు చేస్తూ, ఇంట్లో మాత్రం, "దీనికి చేయటానికి కన్నట్టు ఉంది నేను. వయసులో నేను పెద్ద కాబట్టి ఇది నాకు చెయ్యాలా, నేను దీనికి చేయాలా", అంటూ సాధింపులు చాలా మామూలే పాపం విధిజ్ఞకు.

ఎవరికైనా చెప్తే నమ్మేటట్టు ఉంటుందా? అయినా, "కన్నతల్లి ఇలా ఉంటే ఇంక లోకం మాత్రం ఏం బాగుంటుంది?", అని ఓ వైరాగ్యం లోకి వెళ్ళి పోయింది ఆ పిచ్చి తల్లి. 

అటువంటి సమయంలో జగన్మాత మీద కూడా మమకారం లేకుండా ఓ చిత్రకారుల యాంత్రికంగా చిత్రం గీస్తే ఆ చిత్రం ప్రకృతి ఆంటీ రూపంలో తనని ఆదుకోవడం భలే వింత గానే కాక, ఆనందం గానూ అనిపించింది విధిజ్ఞకు. అందుకే ఆమెతో అంతగా మమేకమైపోయి ఆమె చెప్పిన సంబంధాన్నే చేసుకుంది. 

ఇదిగో, ఇప్పుడు ఆ పెళ్లిలోనే, "అప్పగింతలు".

తండ్రి, "మగవాడు ఏడవకూడదని" అప్పగింతలలో రాని ఏడుపును నటించక్కర్లేదు. పైగా అతని రాక్షసుడు అన్న విషయం ఒక అంతో ఇంతో ఊరూ - వాడా ఎరుగును. అన్న నా కూతురు మీద "ఆడపిల్ల" అని "తండ్రి"కి ప్రేమ లేకపోవడం తప్పుగాని రోజుల్లో పుట్టిన పిల్లయే మరి.

అన్న అయితే, "ఇటు మగపిల్లి ఈరోజుల్లో ఉద్యోగాల కోసం దేశాలు దాటిపోతున్నారు కాబట్టి ఈ బెంగ", అంటూ అతను ఏడవక్కర్లేదు. 

ఎటొచ్చీ వందన పరిస్థితే పాపం, తెగ నవ్వు పుట్టిస్తోంది విధిజ్ఞకు. 

విదిజ్ఞకు పెళ్లి కుదరగానే, అటు తన స్నేహితురాలు కూతురు కూడా పెళ్లి అవుతుంటే, ఇటు పనులు వదిలి అటు వెళ్లడమే కాకుండా, ఆ స్నేహితురాలి కూతురు పెళ్లి అవ్వంగానే విదేశాలకు వీసా పట్టుకుని వెళ్లిపోతుందని అప్పగింతలలో స్నేహితురాలితో పాటు వందన కూడా ఏడ్చిన వైనం, వీడియోలో చూసినా కళ్ళముందు కదలాడుతోంది విధిజ్ఞకు.

ఇప్పుడు తన కోసం ఎప్పటి లానే నటిస్తూ ఏడుస్తుందా, లేక ఏం చేస్తుందీ అని, ఫోటోలు వంక కాకుండా తల్లి వంకే చూస్తోంది. 

అందుకు వస్తోంది నువ్వు. స్వతహాగా తాను చెడ్డది కాకపోయినా, ఇవాళ తల్లి పరిస్థితి చూసి ఎందుకు అక్క వాళ్ళు ఇత నవ్వు వస్తున్నా, ఇంత కాలపు తన దురదృష్టానికి కన్నీరు కారుస్తూ, ఆ కన్నీరు తల్లిని విడిచి వెళుతున్నందు వల్ల అని లోకం అనుకుంటుండగా, లోలోను మాత్రం నవ్వుతోంది. ఇది మొదటి సారి.

22 ఏళ్ల వయసప్పుడు.

ఇప్పుడు రెండ వసారి. 25 ఏళ్ల వయసు. ఇప్పుడు లోపల లోపలే నవ్వుతోంది.

తనకు కానుపు కష్టంగా ఉంది. డాక్టర్లు బ్రతకపోవచ్చు అని తేల్చేస్తున్నారు. తన తల్లిలా కాకుండా, తను తనకు పాప పుడితే మాత్రం చాలా ప్రేమగా చూసుకోవాలనుకుంటే, కపర్ది ఎలాంటి వాడైనా తాను చక్కగా ఉండాలనుకుంటే, ఇప్పుడు దేవుడు ఈ అవకాశం తీసేస్తున్నాడు. కానీ ఏమిటో చిత్రంగా ఏడుపు రావట్లేదు. 

వచ్చేదేమో కానీ, సరిగ్గా అదే సమయానికి తనకు జరుగుతున్న ఆపరేషన్ వార్డు బయట తల్లి రావడం తెలిసింది. మొహమాటానికైనా రావాలి కదా ఇష్టం లేకపోయినా పాపం వందన గారికి.

అడుగు అప్పుడు ఇంకోసారి నవ్వు వచ్చింది ఆపరేషన్ మగతలో ఉన్నా కూడా.

నిజానికి తన పెళ్లి అయిపోయి బయటకు వచ్చేసింది కాబట్టి తండ్రి నుంచి తన పరంగా వచ్చి ఇబ్బందులు ఏమీ ఇప్పుడు ఉండకూడదు వందనకు. కానీ మనసులో పాతుకుపోయిన ద్వేషం కదూ!

విదిగ్నకు అది తన పుట్టుకతోనే అమ్మకు వచ్చింది అని అర్థమైంది కాబట్టి మళ్ళీ తన పిడకల మీదనే పోవాలని అర్థమైనట్టుంది. ప్రశాంతంగా వెళ్లిపోయింది. బిడ్డ కూడా దక్కలేదు. అదో ఊరట విధిజ్ఞకు వెళ్లే ముందు.

మొహమాటానికైనా తన కూతురు మళ్ళీ తల్లి చేతుల్లో ఒక్కరోజు నాటికైనా పడకూడదు అని కోరుకుంటూ తల్లి నటన గా కళ్ళు తుడుచుకోవడం చూస్తూ ప్రశాంతంగా నవ్వుతూ వెళ్ళిపోయింది.

No comments:

Post a Comment