Tuesday, April 1, 2025

 *నవ విధ రామభక్తి.....* 

*సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన సందర్భంలో, భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు ఆ మహాపురుషుణ్ణి సేవించుకొని పావనులయ్యారు. భక్తిమార్గాన్ని అనుసరించి ఆ భగవంతుణ్ణి సగుణ సాకారంగా ఆరాధించేవారికి ఆ యా రీతిలో ఆయన ఫలాల్ని ప్రసాదిస్తాడు. భక్తుల మానసిక స్థాయినీ, సామర్ధ్యాన్ని బట్టి భక్తిమార్గాల్ని విభజించి, నవమార్గాల్లో ఆ దేవదేవుడి పై మన ప్రేమను ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తూ...*

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్ |* 
*అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్ ॥* 

*అనే భక్తిమార్గాలను మన శాస్త్రాలు నిర్దేశించాయి. భగవంతుడి వైభవాన్ని వినడం వల్లనైనా, ఆయనను కీర్తించడం వల్లనైనా, మననం చేసుకోవడం వల్లనైనా, ఆయన పాదాలను సేవించుకోవడం వల్లనైనా, అర్చించుకోవడం వల్లనైనా, వందనాలు అర్పించుకోవడం వల్లనైనా, దేవదేవుడికి దాస్యం చేయడం వల్లనైనా, ఆయనతో సఖ్యతతో మెలగడంతోనైనా, తుదకు ఆత్మను నివేదించుకోవడం ద్వారానైనా భక్తజనులు పునీతులు కావచ్చని మన మహర్షులు ఉద్ఘాటించారు. రామచంద్రమూర్తిని కూడా అనేకమంది భక్తపుంగవులు నవ విధాలుగా తమ పరమప్రేమను ప్రకటించుకున్నారు. హనుమంతుడు. వాల్మీకి మహర్షి, సీతాదేవి, భరతుడు, శబరి, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జటాయువు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఆ తారకరాముడికి చేరువయ్యారు.*

*1. శ్రవణం... ఆంజనేయుడు:*
*ఆర్తితో ఎక్కడ రామనామం ఆలపిస్తారో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. 'ఆ రఘునాథుని కీర్తన వినిపించే చోట వినయపూర్వకంగా, ముకుళిత హస్తాలతో, ప్రేమాశ్రువులు నిండిన పూర్ణనేత్రాలతో నేను ఉపస్థితుడనవుతాన'ని స్వయంగా హనుమంతుడే వెల్లడించాడు. అందుకే శ్రీరాముడి పట్ల శ్రవణభక్తికి ఆయనే విశేష తార్కాణం.*

*2. కీర్తనం... వాల్మీకి మహర్షి :*
*రామనామ జపంతో కిరాతకుడు కూడా కవి వాల్మీకిగా మారిపోయాడు. కోదండరాముడి కీర్తనబలానికి సోదాహరణంగా నిలిచాడు. స్వయంగా రామ కథను రచించి, లోకానికి అందించి కారణజన్ముడయ్యాడు. వేలాది గొంతుకలు రామనామామృతాన్ని గ్రోలి పులకించిపోయే అవకాశాన్ని కల్పించాడు.*

*3. స్మరణం... సీతాదేవి:*
*రావణుడి చెరలో ఉన్నా, స్మరణలో మాత్రం సతతమూ రామచంద్రుడినే నిలుపుకొన్న పరమపావని సీతాదేవి. రాక్షసమూక మధ్య కూడా జగజ్జనని జానకీదేవి పతినామాన్నే ప్రాణాధారంగా చేసుకొని ఆయన స్మరణలోనే గడిచింది. డైలీ విష్ ఆధ్యాత్మిక ఆనందం వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి, మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం పొందండి.*

*4. పాదసేవనం... భరతుడు:*
*తన వల్లే అన్న అడవుల పాలయ్యాడని కుమిలిపోయిన ఆదర్శ సోదరుడు భరతుడు. అందుకు ప్రాయశ్చిత్తంగా అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, పరోక్షంగా భగవంతుడి పాదసేవకే జీవితాన్ని అంకితం చేసిన పుణ్యపురుషుడు.*

*5. అర్చనం... శబరిమాత:*
*అనన్యమైన భక్తితో అర్చించి అయోధ్యానాథుడిని తన కడకు రప్పించుకున్న భక్తశిఖామణి శబరి. రామ ఆగమనాభిలాషియై ఆ పతితపావనుడి పూజలోనే పండిపోయి, ప్రత్యక్షం చేసుకున్న ప్రేమమూర్తి.*

*6. వందనం... విభీషణుడు:*
*సీతాపహరణ అధర్మమని అన్నకు చెప్పి, విడిపించేందుకు విఫల ప్రయత్నం చేసి తుదకు లంకను వీడి వందనభక్తితో రాముణ్ణి ఆశ్రయించి, సీతానాయకుడికి సేవకుడయ్యాడు విభీషణుడు.*

*7. దాస్యం... లక్ష్మణుడు:*
*అవతరించింది మొదలు పై లోకాలకు వెళ్ళే వరకూ అన్నకు దాస్యం చేయడానికే తపించిన తమ్ముడు లక్ష్మణుడు. అన్నతో అడవిలో ఉన్నా అయోధ్య లాగే భావించి, సీతారాములకు దాసుడిగా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ సౌమిత్రి.*

*8. సఖ్యం... సుగ్రీవుడు:*
*సీతాన్వేషణలో విశేష రీతిలో శ్రీరాముడికి సహకరించాడు సుగ్రీవుడు. భగవంతుడితో సఖ్యత చేసి అవతార లక్ష్యానికి సాయం చేసిన ఆదర్శభక్తుడు సుగ్రీవుడు.*

*9. ఆత్మనివేదనం... జటాయువు:*
*సీతామాతను రావణుడి కబంధహస్తాల నుంచి విడిపించేందుకు తన శాయశక్తులా కృషి చేసి అసువులు బాసాడు. ఆత్మనివేదనతో ఆ రాఘవుడిని కూడా కంటతడి పెట్టించి, అంతిమసంస్కారాలు చేయించుకున్న ధన్యజీవి జటాయువు.*

*┈┉┅━❀꧁ జై రామ్ ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🏹🌷 🙏🕉️🙏 🌷🏹🌷

No comments:

Post a Comment