Thursday, April 3, 2025

 *🔊Cool drinks: కూల్‌ డ్రింక్స్‌ యమా డేంజర్‌*

*🔶అధిక సుక్రోజ్‌తో అనారోగ్యమే*

*🔷మధుమేహం, ఊబకాయం ముప్పు*

*🔶మెటబాలిజంపై తీవ్ర ప్రభావం*

*🔷శరీర వ్యవస్థ అస్తవ్యస్థం*

*🔶టాటా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనలో వెల్లడి*

*🍥హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి.. హాయిగా.. కూల్‌కూల్‌గా ఓ కూల్‌డ్రింక్‌ తాగేద్దామనుకుంటున్నారా? ఆ చర్య వల్ల తాత్కాలికంగా శరీరానికి చల్లదనం లభించినా.. తీపి శీతల పానీయాల్లో ఉండే అధిక సుక్రోజ్‌తో ఆరోగ్యానికి చేటు అని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌(టి్‌ఫ-హైదరాబాద్‌, ముంబై)లోని అడ్వాన్స్డ్‌ రిసెర్చ్‌ యూనిట్‌ ఆన్‌ మెటబాలిజం, డెవల్‌పమెంట్‌ అండ్‌ ఏజింగ్‌(అరుమ్డా) శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘న్యూట్రిషనల్‌ బయోకెమిస్ట్రీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. టిఫ్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై తమ పరిశోధనలను చేశారు. 10ు మేర సుక్రోజ్‌ ఉండే నీటిని పరగడపున, ఏదైనా తిన్న తర్వాత వేర్వేరుగా ఎలుకలకు ఇచ్చారు. సుక్రోజ్‌ కారణంగా.. మనం తినే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు, కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్‌(హెక్జోస్‌ షుగర్‌) శోషణ జరుగుతుందని, దీంతో చిన్నపేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు.. ఆహారంలోని ప్రొటీన్లను కండరాలను పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ(అనబాలిక్‌), కొవ్వు, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియ(క్యాటబాలిక్‌)పై దుష్ప్రభావాలకు శీతల పానీయాల్లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్‌ కారణమవుతుందని వెల్లడైంది. మెటబాలిజానికి దోహదపడే కాలేయంపై సుక్రోజ్‌ చూపే దుష్ప్రభావం కారణంగా పలు రుగ్మతలు వస్తాయని, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినా.. మెటబాలిజంపై పడే ప్రభావం కారణంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చలేదని, దాంతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. శీతల పానీయాల్లోని అధిక సుక్రోజ్‌ వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.*

No comments:

Post a Comment