Saturday, April 5, 2025

 *_ఓ..మనిషి.._*
     *_రాకడ ఎందుకు..?_*
                *_పోకడ ఎందుకు..?_*

*_రాకడ పోకట యొక్క మర్మము తెలుసుకొని మసులుకో..._*

*_ఇంతకు.. నీదనేది ఏముంది ఈ లోకాన..?_*

✒️💦✒️💦✒️💦✒️💦

*_ఒక్కోసారి నాకు నేనే.. నాలోనే నేను.. నా మనసుకు ఇలా చెప్పుకుంటూ ఉంటాను._*

*_శవయాత్రలో.. పాల్గొంటూ.. రకరకాలుగా వారి గురించి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా! అదేనండి.._*

*_ఇలా చేయకుంటే ఇంకా బ్రతికి ఉంటుండే అని అంటూ ఉంటారు. కానీ, తాను మాత్రం బ్రతికే ఉంటాననే భ్రమను మాత్రం వీడడు._*

 *_ఏదో ఒక రోజు నేను కూడా ఇలా శవంగా  మారేదే ఉంది.. చివరికి వెళ్ళవలసిందే.. అనేది  మాత్రం అనుకోరు ఏంటో ఈ విడ్డూరం.._*

*_ఓ మనిషి..నాది, నాది అంటూ వెంపర్లాడుతుంటావు... ఇది నాదే..అది నాదే.. ఇదంతా నా కష్టార్జితమే అని విర్రవీగుతావు. ఇంతకు నీదనేది ఏముంది ఈ లోకంలో..?_*

*_నీ దేహమే ఒక అద్దె కొంప.. ఏదో ఒక రోజు  ఈ దేహం అనే కొంపను  ఖాళీ చేయక తప్పదు._*

*_నీవే శాశ్వతం కానప్పుడు.. నీ దేహమే బూడిద పాలవుతుంది అని తెలుసుకున్నప్పుడు. నీ కష్టార్జితము అనుకున్న..నీ ఆస్తి ఎక్కడుంటుంది..?_*

*_నీ కుటుంబ పరివారము,బంధువులు,  స్నేహితులు, ఆత్మీయులు,  శ్రేయోభిలాషులను చూసి.. ఇంతమంది ఉండగా నాకేమీ లోటు అని సంబర పడతావు కదా!_*

*_ఇంతకు నీ పరివారం, బంధుగణం, స్నేహితులు అందరూ నీ చుట్టారా.. ఉండగానే మాయమైపోతావు... నీవనుకున్న వీరందరూ నిన్ను రక్షించారా..?_*

*_అద్దెకు తీసుకున్న ఇల్లు యొక్క గడువు ముగిస్తే.. వెంటనే ఖాళీ చెయ్ అంటాడు ఇంటి యజమాని కదా! అలాగే..నాది,నాది అన్న నీ దేహమే నీ మాట వినకుండా నిన్ను బయటకు గెంటేస్తుంది._*

*_అలాంటిది  ఓ.. మనిషి..కాస్త ఆలోచించు..ఈ దేహం పై మమకారం ఎలా..?  దేహాభిమానాన్ని వదిలి,మనిషిలాగా మానవత్వంతో  ప్రవర్తించు, మానవత్వాన్ని నర నరాల్లో జీర్ణించుకో.._*

*_వారేంటి, గ్యారెంటీ లేని ఈ దేహాన్ని చూసిమొహమేల..?_*

*_అందుకే..నీ ముందున్న భోగాలన్నీ కేవలం నీవున్నంతవరకు  అనుభవించడానికి మాత్రమే!_*

*_ఈరోజు నీది అన్నది రేపు వేరొకడి సొంతం. నీ ముందున్నదంతా మాయేసుమా... ఇదంతా సప్నం లాంటిది... క్షణిక సుఖములాంటిది.._*

*_స్వప్నంలో ఎన్నో రకాల రాజభోగాలను చవిచూస్తావు, అనుభవిస్తావు. తీరా..కళ్ళు తెరవగానే అన్నీ మాయమవుతాయి.. కదా!_*

*_అదేవిధంగా  ఈ లోకంలో నీది అనేది ఏదీ లేదు అంతా నీ బ్రమనే.. అనేది జగద్గురు శంకరాచార్యులు.. సర్వ మానవాళికి హితం పలికారు._*

*_నిజానిజాలు గ్రహించు,మాయ నుండి బయటపడు.మాయల వలలో చిక్కి సతమతం అవ్వకముందే.. జ్ఞానాన్ని గ్రహించు._*

*_ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకో.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దైవాన్ని తెలుసుకోవడమే.._*

*_కేవలం నీ వనుకున్నదే నిజం అనుకుంటే..._*
*_ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులేరి..?_*

*_వారే..సర్వమనుకున్నా నీ ఆత్మీయులేరీ..?_*
*_నీ తాత ముత్తాత లేరి..?_*

*_ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారే కదా!అలాంటప్పుడు ఏదీ శాశ్వతం.తెలుసుకుంటే..అంతా ఆశాశ్వతం.._*

*_ఇంతకు నీవు ఎన్నాళ్ళు ఉంటావు..? ఏదైనా అగ్రిమెంటు,  లేదా ఇంతకాలం ఉంటా..అనే బాండు ఏదైనా నీ వద్ద ఉందా!  శశిరంగా శాశ్వతంగా ఉంటావా..?_*

*_అందుకే.. గర్వము, అహంకారము,చిన్న పెద్ద అనే బెదాన్ని వదిలి.ఉన్నంత వరకు అందరికి ప్రేమను పంచు..  ప్రేమతో పలకరించు.ఇదే నీవు మనిషిగా పుట్టినందుకు అంతిమకర్తవ్యం._*

*_ఎందుకంటే, ఏ పిలుపు  ఆఖరిదో.. ఏది చివరిదో.. చెప్పిరాదు. అందుకే నీ పాత్రను అద్భుతంగా పోషించు.. పదిమంది మెచ్చేలా. పదిమందికి నచ్చేలా.. శాశ్వతంగా ప్రతి హృదయంలో జీవించు..☝🏾_*

No comments:

Post a Comment