'ఇంట్లో పిల్లి! వీధిలోను పిల్లే!.'
***
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
***
సినిమా జరుగుతున్నంత సేపూ నా వెనక వరసలో ఉన్నావిడ, అదే పనిగా మాట్లాడుతూనే ఉంది. ఒక అరగంట భరించి ఇక ఓపిక పట్టలేక వెనక్కు తిరిగి, "దయచేసి కొంత సేపు నోరు మూసుకుంటారా? సినిమా డైలాగ్స్ ఏవి వినపడడం లేదు!" అన్నాను. ఆ తర్వాత ఆవిడ మాటలు ఆగి పోయాయి కానీ, పక్కనే కూర్చున్న భర్తతో "అతను నన్ను ఇన్సల్ట్ చేశాడు!" అంటూ చెప్పడం వినిపించింది. ఆ భర్త ఒక పహిల్వాన్ లా ఉన్నాడు. సినిమా అయిపోయాక బయటకు వస్తూ ఉంటే, "ఏయ్! మిస్టర్!..." అంటూ అతడు నన్ను చేయి పట్టు కొని, గుంజుతూ చీకటిగా ఉన్న ఒక వారకు తీసుకు పోయాడు. నేను ఏదో అనబోయేటంతలోనే గభాలున వంగి నా పాదాలు పట్టుకుని," నా భార్యని నోరుమూసుకోమని చెప్ప గలిగిన మీకు నా వందనాలు సార్! కాసేపు ఇక్కడే ఉండండి!! నేను మిమ్మల్ని చితక్కొట్టానని మా ఆవిడకి చెప్పుకుంటాను!" అంటూ చకచకా కదిలి ముందుకు వెళ్ళి పోయాడు.
No comments:
Post a Comment