Thursday, April 3, 2025

మనిషి తాను స్వేచ్ఛా జీవిననుకుంటాడు కానీ నిజానికి సంఘజీవి- కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించుకోక తప్పదు. ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నపుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి. ఇంటి విషయాల్లో ఇతర కుటుంబసభ్యుల సలహాలకు విలువనివ్వాలి. మిత్రులతో కలసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి. తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రువులవుతారు. మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం. అలా కాకుండా దాని నియంత్రణలోకి వెళ్లిన వ్యక్తి కష్టాలపాలవుతాడు.
అందుకని ఏయే గుణాలను విడిచిపెట్టాలో భారత చెప్పింది. క్రోధం దుర్జయుడైన 
శత్రువు. లోభం అంతులేని వ్యాధి. మిత్రులను దూరం చేస్తుంది. ధర్మ మూఢత్వమే మోహం. హృదయ తాపమే మత్సరం అని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. కాబట్టి అరిషడ్వర్గాలను విడిచి పెట్టాలి. శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును పట్టి పీడించవు. సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి దోహదపడుతుంది.🕉️🚩

No comments:

Post a Comment