Monday, April 7, 2025

 


సినిమా చూసిన రెండు వారాల తర్వాత కూడా నా మైండ్ లో నుంచి పోని ఆలోచనలు.....

ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు (తెలిసీ తెలియని మాయదారి వయస్సు కాబట్టి) చేసింది తప్పా ఒప్పా అనేది కాసేపు పక్కన పెడితే...

హీరో పాత్ర తల్లి చేసింది మాత్రం ముమ్మాటికీ తప్పే... 

వయసులో ఉన్న కొడుకు, తెలిసో తెలియకో ఇష్టపడిన అమ్మాయిని ఇంటికి తీసుకు వస్తుంటే,  ఆ విషయం భర్తకు తెలియకుండా దాచి సపోర్ట్ చేయడం,  సంసారం కోసం కష్టపడే మొగుడిని పిచ్చోడ్ని చేయడం నాకు సబబు అనిపించలేదు.

ఆమెకి కూడా హీరోయిన్ వయసు కూతురు ఉంది కదా,
చదువు మానేసిన కొడుకు ఏం చేస్తున్నాడో ఆమెకి కనీస అవగాహన లేకుండా సపోర్ట్ చేయడం, అలాంటి వాడి కోసం ఒక అమ్మాయి ఇంటికి వస్తే బుుద్ధిచెప్పాల్సింది పోయి ఈడొచ్చిన కూతురిని కూడా వాళ్ళతో కూర్చోబెట్టింది.
...
ఇకపోతే హీరోయిన్ పాత్ర మదర్...

మహాతల్లి, గొప్ప పెంపకం. గదిలోకి పోయి పెళ్లాట ఆడుకున్నాం అనగానే ప్రేమగా hug చేసుకుంటుంది పైగా   ఇదేం పని అని ఒక్క మాట కూడా అనలేదు.

అసలే తండ్రి లేడు, ఆ అమ్మాయి తల్లి ఎంత బాధ్యతగా ఉండాలి ?  అతనిని ఇష్టపడటానికి లేదా ప్రేమించడానికి ఒక్క కారణం కూడా అడగలేదు.

తీరా కేస్ అయిపోయాక కూతురిని తీసుకెళ్తూ ఒకరకమైన గర్వంగా నడుచుకుంటూ వెళ్లడం, ఆ అమ్మాయి వెళ్ళి హీరోని కలిసి వాటేసుకోవడం.

హీరో హీరోయిన్ ల తల్లుల క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు.

హీరో పాత్ర  చదువు మానేసాడు, సెటిల్ అవ్వలేదనే తండ్రి బాధ ఎవరికీ అక్కరలేదు.

చివరలో హీరోయిన్ వచ్చి హీరోతో నాకు 18 నిండాయి అని చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏమిటి?

శివాజీ  పాత్ర చెప్పే విధానం తప్పేమో గానీ, చెప్తోంది మంచే కదా.. మనింట్లో ఆడపిల్లను అలా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తామా లేదా ప్రేమ అంటూ తిరిగితే మౌనంగా ఉంటామా? అతన్ని విలన్ లా చూడ్డం ఏంటో ??

చట్టాలు ఎవరికోసం చేస్తున్నారో...వాళ్ళకే తెలియకపోతే ఎందుకు? అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా నిజంగా బాగా తీసారు...

పైన చెప్పిన ఆలోచనలు చాలామందికి రేకెత్తించారు. చట్టాల గురించి చర్చించే  ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి

No comments:

Post a Comment