[7/14, 18:42] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
జాతులందు మిగుల జాతియేదెక్కువో?
యెఱుకలేక తిరుగ నేమిఫలము?
యెఱుక కలుగువాడె యెచ్చైన కులజుడు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
జాతులన్ని సమానమే. ఒకటి ఎక్కువ కాదు మరొకటి తక్కువ కాదు. జ్ఞానం లేకుండా తనది పెద్ద కులమమి చెప్పుకొని తిరిగిన ప్రయోజనముండదు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారిదే గొప్పకులము. జ్ఞానం అన్నిటికన్న గొప్పది. కాబట్టి మూర్ఖునివలే కులాన్ని ప్రదర్శించకుండా జ్ఞానాన్ని సంపాదించాలి.
[7/14, 18:42] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.*
[7/14, 18:42] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*కాకీ కాకీ రావా*
కాకీ కాకీ రావా
కాటిక కొంచెం తేవా?
పిచ్చుకా పిచ్చుకా రావా
రంగులటోపీ తేవా?
బాతూ బాతూ రావా
బంతిపూలు తేవా?
చిలుకా చిలుకా రావా
జామపండు తేవా?
గబగబ మీరు రాకుంటే
అడిగినవన్నీ ఈకుంటే-
మా తాత తుపాకితో
ఢాం..ఢాం..ఢాం.
[7/14, 18:42] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అడవిలో కాచిన వెన్నెల.... ముదిమిన చేసిన పెళ్ళి రెండు ఒకటే*
అడవిలో కాచిన వెన్నెల ఉపయోగం లేనట్లే ముసలి వానికి పెళ్ళి చేస్తే ఫలితం ఉండని దీని అర్థం. ఏదైనా నిరుపయోగము అని చెప్ప దలిస్తే ఈ సామెతను వాడుతారు. అడవిలో కాచిన వెన్నెల మానవులకు ఉపయోగము కాదు..... వయస్సు మీరిన తర్వాత చేసిన పెళ్ళి కూడా అక్కరకు రాదు అని దీని అర్థము.
[7/14, 18:42] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఒళ్లు మండడం*
అయిష్టం,
కోపం రావడం
వీడంటే వాడికి బలే ఒళ్లు మంట
*ఒరగటం*
(వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు) సమకూరటం, ప్రాప్తించటం,
పరిస్థితులు సానుకూలంగా మారటం,
లాభం రావటం
*ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.*
[7/14, 18:42] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*
*చిలుక - ఏనుగు*
పడ్డతరువాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది.
అడవిలో దొరికే తియ్యని పండ్లు తింటూ, తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది. ఒక పెద్దచెట్టు కింద కాళ్ళు బోర్లాచాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది.
వెంటనే చెట్టుమీదనుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు మూపురంమీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టుమీదకి చేరి కిలకిలా నవ్వింది.
’ఏయ్ చిలకా! నా నిద్ర ఎందుకు పాడుచేశావ్?’ అంది ఏనుగు కోపంగా. ’ఊరికే’ అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్లు మూసుకుని పడుకుంది.
కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి, ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి, వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు ’ఏయ్ చిలకా! నీకేం పనిలేదా?’ అంటూ కోపంగా ఘీంకరించింది.
కానీ చిలుక మరో రెండుమూడు సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడినుంచి లేచి బయలుదేరింది. చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టుమీద వాలింది.
ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తలా, మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహమనిపించింది. అది అనుకుంది,
"ఆహా! నాకన్నా వెయ్యిరెట్లు బలమైన ఏనుగుకూడా నా దెబ్బకు భయపడిపోయి, వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు" అని. ’ఊ.... ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా’ అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది.
కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని "ఉఫ్..." మంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక, ఇక ఎగరలేక, ఆ చెరువులో పడి గిలగిలా కొట్టుకున్నది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డుమీదికి విసిరేసింది.
చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అది ఏనుగును వేడుకొన్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి, తన దారిన తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం, చిన్నంతరం తెలిసింది.
[7/14, 18:42] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🟥హీటర్ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా పైనుండే నీరే ముందు వేడెక్కుతుందేం?*
బకెట్‌లో నీటి అడుగున వాటర్ హీటర్ కాయిల్‌ను ఉంచి ఆన్ చేయగానే ముందుగా కాయిల్ చుట్టూ ఉండే నీరు వేడెక్కుతుంది. ద్రవాల సాంద్రత, ఉష్ణోగ్రత పెరిగే కొలదీ తగ్గుతుంది. అందువలన కాయిల్ చుట్టూ వేడెక్కిన నీరు వెంటనే బకెట్ ఉపరితలానికి చేరుకుంటుంది. ఉపరితలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే నీరు బకెట్ అడుగుకు చేరుకొని, కాయిల్‌వల్ల వేడెక్కి తిరిగి పైకి చేరుకుంటుంది. ఇలా బకెట్‌లోని నీరంతా ఒకే ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నీరు పై నుంచి కిందకు, కిందనుంచి పైకి కదులుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రక్రియను ఉష్ణ వికిరణం (heat convection) అంటారు.
No comments:
Post a Comment