Monday, July 14, 2025

 *\!/శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన శక్తి\!/*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
                *(3 వ భాగము)*

*భగవంతుని జ్ఞానమే మహోన్నతమైన సంపూర్ణ జ్ఞానము. భక్తియోగము తప్ప మరియే ధర్మవిధానము చేతను అతడు అవగతము కాడు. కనుక భక్తి యోగనిర్వహణచే శీఘ్రమే పరిపూర్ణజ్ఞానమనే ఫలము లభిస్తుంది. జ్ఞానప్రాప్తి తరువాత మనిషి భౌతికజగత్తు పట్ల విరక్తుడౌతాడు. ఇది శుష్క, తాత్త్విక కల్పనము. కాదు, భక్తులు భౌతిక జగత్తు పట్ల విరక్తులయ్యేది కేవలము సిద్ధాంతపరమైన అవగాహనమువలన గాక స్వానుభవము వలననే అయి ఉంటుంది. భగవంతునితో సాంగత్య ప్రభావాన్ని అనుభూతమొనర్చు కొనినపుడు భక్తుడు సహజంగానే నామమాత్ర సంఘము, స్నేహము, ప్రేమ అనేవాటితో సాంగత్యాన్ని నిరసిస్తాడు. ఈ విరక్తి శుష్కమైనది కాదు; దివ్యమైన రసభావాలను ఆస్వాదించడము ద్వారా మహోన్నత జీవనస్థితిని సాధించడము వలననే అది ఒనగూడుతుంది. అటువంటి జ్ఞానాన్ని, భౌతికమైన ఇంద్రియభోగ* *విరక్తిని సాధించిన తరువాత వేరే ప్రయత్నం లేకుండగనే అణిమ లఘిమ ప్రాప్తి వంటి అష్టసిద్ధులు ఒనగూడుతాయని. శ్రీమద్భాగవతములో చెప్పబడింది. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానము. అతడు భక్తుడే గాని మహాయోగి కాడు. అయినా అంబరీషునితో ఒనగూడిన. వివాదములో అతని భక్తి ముందు మహాయోగియైన దుర్వాసుడే పరాజితు డయ్యాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే శక్తిసాధనకు భక్తుడు యోగాన్ని విడిగా సాధన చేయవలసిన అవసరము లేదు. చిన్నపిల్లవాడు శక్తిమంతుడైన తండ్రికి శరణుజొచ్చి నపుడు తండ్రి శక్తులన్నీ ఆ పిల్లవాని వెనుకనే ఉన్నట్లుగా, భగవత్కరుణచే శక్తి భక్తుని వెనువెంటనే ఉంటుంది.*

*మనిషి భగవద్భక్తునిగా సుప్రసిద్ధుడైతే ఆ యశస్సు ఏనాడును నశింపదు. శ్రీచైతన్య మహాప్రభువు రామానందరాయునితో మాట్లాడుతున్నప్పుడు "ఏది మహోన్నతమైన యశస్సు?" అని ప్రశ్నించారు. విశుద్ధ కృష్ణభక్తునిగా తెలియ బడడమే పరిపూర్ణమైన యశస్సని రామానందరాయలు జవాబిచ్చారు. కనుక సారాంశమేమంటే విష్ణుధర్మము కేవలము వివేకవంతులైన వ్యక్తులకే ఉద్దేశింప బడింది. వివేకాన్ని సక్రమముగా వినియోగించుకోవడము ద్వారా మనిషి భగవంతుని తలచే స్థితికి వస్తాడు. భగవచ్చింతనము ద్వారా అతడు భౌతికజగత్తు యొక్క చెడుసాంగత్య కల్మషము నుండి ముక్తుడై ఆ విధంగా శాంతుడౌతాడు. మానవ సంఘములో అటువంటి ప్రశాంతులైన భక్తులు కొరవడిన కారణంగానే ప్రపంచము కల్లోల పరిస్థితిలో ఉన్నది. మనిషి భక్తుడు కానిదే సకల జీవుల పట్ల సమదర్శి కాలేడు, ప్రతీజీవుని భగవదంశగా చూచెడి కారణంగా భక్తుడు పశువులు, మానవులు, సకలజీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు. సకలజీవులను సమానంగా చూసే స్థితికి వచ్చినవాడు ఎవ్వరి పట్ల రాగద్వేషాలను కలిగి ఉండడని ఈశోపనిషత్ లో స్పష్టంగా చెప్పబడింది. భక్తుడు తన అవసరానికి మించి కూడబెట్టడానికి ఆత్రుత పడడు. అందుకే అతడు అకించనుడు. ఏ జీవనస్థితిలోనైనా అతడు పరమ సంతుష్టునిగానే ఉంటాడు. భక్తుడు స్వర్గనరకాలలో ఎక్కడైనా సరే సమచిత్తుడై ఉంటాడని చెప్పబడింది. భక్తియోగానికి అన్యమైన విషయాలలో అతడు నిరక్తుడై ఉంటాడు.*

*ఈ జీవనరీతియే మహోన్నత పూర్ణత్వస్థితి. దాని నుండి భక్తుడు. భగవద్ధామానికి చేరుకుంటాడు. భగవద్భక్తులు విశేషముగా సత్త్వగుణముచే ఆకర్షితులై ఉంటారు. యోగ్యుడైన బ్రాహ్మణుడు సత్త్వగుణానికి ప్రతీకగా ఉంటాడు. అందుకే భక్తుడు బ్రాహ్మణత్వముపట్ల అనురక్తుడై ఉంటాడు. రజస్తమోగుణాలు విష్ణుభగవానుని నుండియే వచ్చినప్పటికిని వాటి పట్ల భక్తుడు ఇష్టమును చూపించడు. భక్తులు భాగవతములో "నిపుణ బుద్ధయః" అని వర్ణించబడినారు. అంటే వారు పరమ బుద్ధిమంతుల తరగతికి చెందినవారు. రాగద్వేషాలచే ప్రభావితుడు కాకుండ భక్తుడు పరమశాంతితో జీవిస్తూ రజస్తమోగుణాలచే కల్లోలితుడు కాకుండ ఉంటాడు.*

*భక్తుడు సకల భౌతికగుణాలకు అతీతుడైతే భౌతికజగత్తులోని సత్త్వగుణానికి ఎందుకు అనురక్తుడై ఉంటాడనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దీనికి సమాధానమేమంటే నానారకాలైన గుణాలను కలిగిన జనులు నానారకాలుగా ఉన్నారు. తమోగుణ యుతులు రాక్షసులుగా పిలువబడతారు, రజోగుణయుతులు అసురులని పిలువ బడతారు. ఇక సత్త్వగుణయుతులు సురులు (దేవతలు). భగవంతుని నిర్దేశములోనే ఈ మూడు తరగతుల జనులు ప్రకృతిచే సృష్టించబడ్డారు. కాని సత్త్వగుణములో ఉన్నవారికే భగవద్ధామానికి చేరే అవకాశము ఎక్కువగా ఉంటుంది.*

*ఈ విధంగా ఎవ్వడు పరమ దైవతమో నిర్ణయించడానికి యత్నించినట్టి సరస్వతీ తీరములోని ఋషిబృందము విష్ణు ఆరాధనము పట్ల సర్వసందేహదూరులయ్యారు. తరువాత వారంతా భక్తియుత భగవద్ధామానికి చేరుకున్నారు. సేవలో నెలకొనినవారై వాంఛితఫలాన్ని సాధించి భవబంధవిముక్తికి నిజంగా ఉత్సాహపడేవారు శ్రీ శుకదేవగోస్వామి తెలిపిన నిర్ణయాన్ని శీఘ్రమే స్వీకరించడము మంచిది. శ్రీమద్భాగవత శ్రవణము మోక్షమునకు అత్యంత అనుకూలమైనదని శుకదేవగోస్వామిచే చెప్పబడిన భాగవతము ఆదిలోనే తెలుపబడింది. అదే విషయము ఇపుడు సూతగోస్వామిచే ధ్రువపరుపబడింది. భౌతికజగత్తులో గమ్యము లేకుండ పరిభ్రమించేవారు. శుకదేవగోస్వామి పలికిన అమృతవాక్కులను వింటే నిక్కముగా సరియైన నిర్ణయానికి వస్తారు. అదేమిటంటే దేవదేవునికి భక్తియుత సేవ చేయడము ద్వారా మనిషి నిరంతరము సంసారమార్గాన చరించడము వలన కలిగే శ్రమను తొలగించుకో గలుగుతాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే విష్ణుభగవానుని ప్రేమయుత సేవలో సుస్థిరుడైన వ్యక్తి సంసారప్రయాణము నుండి నిక్కముగా ఊరటను పొందుతాడు. దీనికి పద్ధతి చాలా సులభము. అదేమిటంటే శ్రీమద్భాగవతరూపములో శుకదేవగోస్వామి పలికిన తియ్యని పలుకులను మనిషి శ్రద్ధతో వినాలి.*

*తుదకు తేలిన మరొక విషయమేమంటే దేవతల నెన్నడును, బ్రహ్మరుద్రుల నైనా సరే విష్ణువుతో సమానముగా భావించకూడదు. ఆ విధంగా ఎవరైనా చేస్తే పద్మపురాణము ననుసరించి వెంటనే పాషండులుగా, అంటే నాస్తికులుగా జమకట్ట బడతారు. కేవలము దేవదేవుడైన విష్ణువే ఆరాధ్యుడని, హరేకృష్ణమహామంత్రము లేదా అటువంటి ఏదేని విష్ణుమంత్రమే సర్వదా జపించదగినదని హరివంశమనే వేద వాఙ్మయములో చెప్పబడింది. "శివుడు, తాను ఇద్దరము భగవంతుని చేతనే వివిధ సామర్థ్యములతో అతని నిర్దేశములోనే కార్యములలో నియుక్తులము అయినామని" బ్రహ్మదేవుడే భాగవతమునందలి ద్వితీయస్కంధములో పలికాడు. కేవలము శ్రీకృష్ణుడే ఈశ్వరుడని, అన్యజీవులందరు కేవలము కృష్ణ సేవకులని శ్రీచైతన్య చరితామృతములో కూడ చెప్పబడింది.*

*కృష్ణుని కన్నను ఉన్నతమైన సత్యము వేరొక్కటి లేదని భగవద్గీత యందు ధ్రువపరుపబడింది. శుకదేవగోస్వామి కూడ అన్ని విష్ణుతత్త్వములలో శ్రీకృష్ణుడు నూటికినూరుపాళ్ళు దేవదేవుడనే విషయంవైపు దృష్టిని ఆకర్షించడానికి ఆతడు ధరాతలము పై ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను వివరించాడు.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన శక్తి" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁

No comments:

Post a Comment