Sunday, July 13, 2025

 నేటి మంచి మాట.
సముద్రంలో ఎన్నో అలలు అందులో తీరం చేరేవి కొన్నే, అలాగే జీవితంలో స్నేహితులు బంధువులు ఎందరో కానీ మనసులో ఉండేది కొందరే వారే నిజమైన స్నేహితులు ఆత్మీయులు.

 సమాజం, సముద్రం, జీవితం చూడటానికి అద్భుతంగా ఉంటాయి. కానీ ఈదటానికి కష్టంగా ఉంటాయి. తట్టుకొని ముందుకెళ్తేనే మన సత్తా ఏమిటో తెలుస్తుంది.

 అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి కరిగిపోయిన తర్వాత కాలం విలువ తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ తెగిపోయిన తర్వాత బంధం విలువ పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు.

బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటు అంటూ ఏదీ ఉండదు. మన ఒక్కరికే బాధ ఉన్నట్లు బాధపడుతుంటాం. నిజానికి మనం బాధలు అనుభవిస్తున్నాం అందరూ బాధల్లో ఈత కొడుతున్నారు.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment