ఒక
#Satya_Nadella_సత్యనాదెళ్ల..
ఒక #Sundar_Pichai_సుందర్_పిచయ్..
#లక్షల_కోట్ల రూపాయిల విలువైన దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు అధిపతులు..!
వీరు భారతీయులు కావడంతో మరింత ప్రత్యేకంగా చెప్పుకొంటాం...!
మరి ఒక మహిళ..
అందులోనూ ఓ భారతీయ దిగ్గజ సంస్థకు అధిపతి కాబోతున్నారు...!
హిందూస్థాన్ యూనీ లీవర్ (హెచ్‌యూఎల్)...
ఈ సంస్థ గురించి తెలియని భారతీయులు.. ఆ సంస్థ ఉత్పత్తులు ఉండని భారతీయులు ఉండరు. సబ్బుల నుంచి సౌందర్య ఉత్పత్తుల దాకా అనేక రకాలుగా రోజువారీ మనం వాడే వస్తువుల్లో ఎన్నో రకాలు హెచ్‌యూఎల్‌వే. ఈ సంస్థ విలువ ఎంతో తెలుసా...?
అక్షరాలా రూ.5.6 లక్షల కోట్లు...!
మహిళలు అబలలు కాదు సబలలు అని నిరూపిస్తూనే ఉన్నారు. అందులోనూ భారతీయ మహిళలు తాము ఎందులోనూ తీసిపోమని చాటుతున్నారు.
ఈ కోలోకే వస్తారు ప్రియా నాయర్. రూ.5.6 లక్షల కోట్ల కంపెనీ అయిన హెచ్‌యూఎల్‌కు కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఆమె...
తాజాగా ప్రియా నియామకానికి హెచ్‌యూఎల్ బోర్డు ఆమోద ముద్ర వేసింది.
ప్రియా ఆగస్టు 1 నుంచి ఎండీ-సీఈవో బాధ్యతలు స్వీకరిస్తారని హెచ్‌యూఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల పాటు.. అంటే 2030 జూలై 30 వరకు ప్రియా పదవిలో కొనసాగుతారు.
అయితే, ఎవరీ ప్రియా నాయర్ అంటే.. ప్రస్తుతం యూనీలీవర్‌లో బ్యూటీ-వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్. ఈమె ప్రస్తుతం చూస్తున్న పోర్ట్‌ఫోలియో విలువే 13 బిలియన్ యూరోలు. ఇక ఈ నెలాఖరుతో హెచ్‌యూఎల్ ఎండీ-సీఈవోగా రోహిత్ జావా వైదొలగుతారు.
ఆయన స్థానంలో ప్రియా బాధ్యతలు చేపడతారు. రెండేళ్ల కిందట హెచ్‌యూఎల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే, ఈయనది సంస్థలో 37 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.
రోహిత్ జావాకు ఏమాత్రం తగ్గని అనుభవం ప్రియాది. హెచ్‌యూఎల్‌లో 30 ఏళ్ల నుంచి ఉన్నారు. అనేక పదవులు చేపట్టారు. అంచలంచెలుగా ఎదిగారు. హోమ్ కేర్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, బ్యూటీ-పర్సనల్ కేర్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
మనందరం వాడే డవ్ షాంపూలు, రిన్ సబ్బులు, దుస్తులకు సువాసన అందించే కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్లను మరింతగా జనంలోకి వెళ్లేలా చేశారు. సిడెన్హామ్ కాలేజీలో కామర్స్ డిగ్రీ చదివారు.
పుణెలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ చేశారు.
No comments:
Post a Comment