*ఆదివారం వస్తే.... ఆలయాల పరిశుభ్రత*
: మధ్యప్రదేశ్ లోని జబల్పుర్ కు చెందిన కొందరు విద్యార్థులు ఆదివారం వచ్చిందంటే.. చీపుర్లు, బకెట్లతో ఆలయాలకు చేరుకొని శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నారు. అనురాగ్ విశ్వకర్మ, తనిష్క్ సోనీ అనే ఇద్దరు యువకుల స్ఫూర్తితో వారు ఈ సేవామార్గంలో పయనిస్తున్నారు. నగరంలో నర్మదానది ఒడ్డున ఉన్న ఆలయంలో అపరిశుభ్రతను చూసి కలత చెందిన వీరిద్దరూ స్వయంగా ఆలయాన్ని శుభ్రపరిచి, ఆ వీడియోను వైరల్ చేశారు. గురుద్వారాలు, మసీదులు, చర్చీలు చాలా శుభ్రంగా ఉంటున్నాయని.. ఆలయాలు మటుకు పాలిథిన్ కవర్లు, పడేసిన పూజా సామగ్రితో అపరిశుభ్రంగా ఉన్నాయని వీడియోలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన యువత భారీగా ముందుకువచ్చి మద్దతు తెలిపారు. తనిష్క్, అనురాగ్ 70 నుంచి 80 మంది యువతతో 'సనాతన్ సేవా గ్రూప్' ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య క్రమంగా పెరిగి, ప్రతి ఆదివారం వివిధ ఆలయాల్లో శుభ్రత పనులకు తోడు పరిసరాల్లో మొక్కలు కూడా నాటుతున్నారు.
No comments:
Post a Comment