Monday, July 14, 2025

 *జై శ్రీరామ్* 🙏🏻🙏🙏🏼

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*చూపు- చిన్నచూపు…!*
      *అవహేళన- పశ్చాతాపం*
                 ➖➖➖✍️

      *ఒక 24 సంవత్సరాల యువకుడు తన వృద్దులైన తల్లితండ్రులతో    రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలులో కిటికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు.*

*ఆ పక్కనే కూర్చున్న నలుగురు యువకులు ఈ యువకుడినే చూస్తున్నారు.*

*రైలు స్టేషన్ నుండి బైలుదేరింది.*

*ఇంతలో ఆ యువకుడు ‘నాన్నా నాన్నా! చూడు చూడు…  ప్లాట్ ఫాం పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు!’ అని గట్టిగా కేరింతలుకొట్టి నవ్వుతున్నాడు.*

*పక్కన ఉన్న ఆ నలుగురు కుర్రోళ్ళు ఈ యువకుడినే చూస్తూ నవ్వుకుంటున్నారు.*

*ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లెప్రాంతం వైపుగా వెళ్తుంది.*

*మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్నా నాన్నా చూడు చెట్లు, కొండలు, రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి" అని కేరింతలు మొదలు పెట్టాడు.*

*పక్కన ఉన్న ఆనలుగురి యువకులలో ఒకడు.., "అవునా వెళ్ళు , వెళ్ళి గట్టిగా పట్టుకో పారిపోతున్నాయి!" అని గేలి చేసాడు.* 

*ఇది విని కూడా ఆ యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే "సరే" అంటు కొడుకు వైపు చూస్తూ ఆనందగా ఉన్నాడు ..,*

*మళ్ళి ఈయువకుడు గట్టిగా "నాన్నా నాన్నా చూడు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి" అంటూ కేరింతలు మొదలు పెట్టాడు.*

*ఇంతలో ఆ నలుగురిలో ఒకడు "అవునవును మేఘాలని మన రైలుకి కట్టేశారు అందుకే మనతోనే వస్తున్నాయి" అని వెక్కిరించారు.,* 

*పక్కనే ఉన్న తల్లి… “అవును నాన్నా! మేఘాలు కదా అలాగే మన వెంట వస్తాయి!” అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.*

*ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలని చూసి. ఆ చుక్కల్లోనుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వుతున్న యువకుడిని చూసి మళ్ళి ఆ నలుగురిలో ఒకడు "మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్ లో చూపించండి ఎందుకైనా మంచిది!" అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నాడు.*

*ఈ యువకుడి తండ్రి "ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబూ, పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము.*

*బెయిలీ ద్వారా చదివి CA లో దేశంలోనే మొదటి రాంకు వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా వీడికి చికిత్స చేయించింది. ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు." అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు.*

*తల్లి తండ్రుల డబ్బుతో విలాసంగా జీవిస్తూ ఇతరులని ఎగతాళి చేస్తున్న ఆ నలుగురు యువకులు తామెంత తప్పుగా ప్రవర్తించామో అని సిగ్గుతో తల దించుకున్నారు.*

*ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం!*✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment