Sunday, July 13, 2025

స్త్రీని ప్రేమించడం అంటే.

 *స్త్రీని ప్రేమించడం అంటే.*

*ఒక స్త్రీని ప్రేమించడం అంటే, షరతులు లేకుండా ఆమెను ప్రేమించడం. ఆమె సంతోషంగా, ఉత్సాహంగా, నవ్వుతూ ఉన్నప్పుడు మాత్రమే కాదు... తను మౌనంగా ఉన్నప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు, తనలో తను బాధపడుతున్నప్పుడు కూడా ప్రేమించగలగాలి.*

*నువ్వు చాలు, నాకు నువ్వు ఉంటే చాలు అని ఆమె నీపై నమ్మకం పెంచుకునేలా చేయండి.*

*ఆమెకు స్వేచ్చను ఇవ్వండి*

*ఆమె బలహీనంగా ఉన్నప్పుడు, ఆమెకు అండగా నిలబడండి.*
*ఆమె తన మనసులోని మాటలు మీతో పంచుకున్నప్పుడు వాటిని రహస్యంగా ఉంచండి.*
*వాటిని తనకి వ్యతిరేకంగా ఎప్పుడూ వాడకండి. తను తనలాగే స్వేచ్ఛగా ఉండగలిగే ప్రశాంతమైన చోటు మీరే అని ఆమెకు అనిపించాలి.*

*ఆమెను నవ్వించండి...* 

*కళ్ళకి నిద్రలేక అలసిపోయి ఆమె అందవిహీనురాలుగా ఉన్నా సరే, "నువ్వు అందంగా ఉన్నావు" అని చెప్పండి. ఆమెను చిన్న మాటలతో నవ్విస్తూ ఉండండి. "నీ ఉనికే ఒక వరం" అని ఎప్పుడూ తనకి గుర్తుచేస్తుంటే, ఆమె ఒక పువ్వులా  వికసిస్తుంది.*

*ఆమెను ప్రేమగా కౌగిలించుకోండి...*

*ఆమె భయపడినప్పుడు గట్టిగా కౌగిలించుకోండి. జనం మధ్యలో ఉన్నప్పుడు, "నేను నీతోనే ఉన్నాను" అని చెప్పకనే చెప్పేలా తనపై మెల్లగా చేయి వేయండి. ఆమెను కేవలం కోరికతో కాకుండా, ప్రాణంగా చూసుకుంటున్నారని తెలిసేలా కౌగిలించుకోండి.*

*ఆమె మౌనాన్ని కూడా అర్థం చేసుకోండి...*

*తను ఏదైనా విషయంలో బాధగా, తికమకగా ఉన్నప్పుడు తనలో తను వెనక్కి తగ్గొచ్చు.* *అలాంటప్పుడు తనని బలవంతంగా బయటికి రప్పించొద్దు. తన పక్కన కూర్చుని, తనతోపాటే ఉండండి. మాట్లాడకపోయినా సరే, మీ ప్రేమ తనకి తెలియాలి.*

*గుర్తుంచుకోండి:*

*ప్రతిరోజూ మీరు తనను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటుంది.*
*ఆమెను పూర్తిగా ప్రేమించండి తనలోని వెలుగును, చీకటిని, బలాన్ని, సున్నితత్వాన్ని, ఆనందాన్ని, కన్నీళ్లను.*
*ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే పరిపూర్ణత గురించి కాదు – ఎప్పుడూ తన పక్కన ఉండటం గురించే.*
*తను ఎలా ఉందో అలాగే ప్రేమించడం, ఎప్పుడూ తనను వదిలి వెళ్లకుండా ఉండటం గురించే.*

No comments:

Post a Comment