🛕🍁🛕🍁🛕🍁🛕🍁🛕
*జగన్నాథ స్వామీ*
*నయన పథగామి*
భారతదేశంలో జరిగే అన్ని రథోత్సవాల్లోనూ ఒక ప్రత్యే కతను కలిగినది పూరీ జగన్నాథ రథోత్సవం. ప్రతి ఏడాది జరిగే దీనిని దర్శించడానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచేకాక విదేశాల నుంచి కూడా భక్తులు పూరి క్షేత్రానికి వేలాదిగా వస్తారు. ఈ రథాన్ని తాకాలనీ, లాగాలనీ భక్తులు పోటీ పడతారు.
క్రీస్తు పూర్వం 500 సంవ త్సరాల నాడే జగన్నాథుడు ఇంద్రద్యుమ్నుడనే రాజు చేత పూజలందుకున్నా డంటారు. మగధ మహారాజు మహా పద్మనందుడు ఆ జగన్నాథుని విగ్రహాన్ని మగధకు చేర్చాడట. కళింగరాజు ఖారవేలుడు మగధను జయించి తిరిగి జగన్నాథుని పూరీకి తీసుకు వచ్చాడంటారు. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించినది మాత్రం అనంత వర్మ. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్కు 65 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉంది. ఈ పుణ్య క్షేత్రంలో జగన్నాథునిగా శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు.
శ్రీకృష్ణ రూపం ఆయనది.
ఈ క్షేత్రానికి పలు నామాలున్నాయి.
*శంఖ క్షేత్రమనీ, నీలాద్రి అని, కుశస్థలి* అని దీనికి పలు పేర్లున్నాయి. సంవత్సర మంతా ఈ క్షేత్రం భక్తులతో అలరారుతుంది. రథోత్సవ సమయంలో పూరీ క్షేత్రం వింత శోభను సంతరించుకుంటుంది.
జగన్నాథాలయం చతురస్రాకారంలో నీలగిరిమీద ఉంది, మొదటి ప్రాకారానికి నాలుగు ద్వారాలున్నాయి.
వాటిలో తూర్పు ద్వారం చాలా పెద్దది. అక్కడ రెండు వైపులా రెండు సింహాలుంటాయి. దాన్నే సింహ ద్వారం అంటారు. ఈ ద్వారానికి ఎదురుగా దాదాపు ఎత్తయిన స్తంభం ఉంది. దీన్నే అరుణ స్తంభం అని అంటారు. సింహ ద్వారం నుంచి భక్తులు గుడిలో ప్రవేశిస్తారు. లోపల రెండో ప్రాకారం ఉంది. దానికి నాలుగు వైపులా ద్వారాలు న్నాయి. ద్వారాలన్నీ ఒకదాని కొకటి ఎదురుగా ఉంటాయి. ఈ రెండో ప్రాకారం లోపలే జగన్నాథ స్వామి మందిరంతో బాటు మరో 120 మంది రాలు ఉన్నాయి. భక్తులు ముందుగా పాతాళేశ్వర స్వామిని దర్శించి ముందుకు వెళ్లి గరుడ స్తంభానికి మొక్కి ఆపైన ధ మందిరానికి వెళతారు. దీన్ని విమాన మందిరం అంటారు. ఇక్కడ అన్నా జగన్నాధ చెల్లెళ్లయిన సుభద్ర, బలభద్రులు (బలరాముడు) తో కొలువైన స్వామి మనకు దర్శనమిస్తారు.
ద్వాపరయుగంలో ఆషాఢ మాసపు ద్వితీయ దినాన స్వామి గోకులం నుంచి ఊరేగింపుగా ద్వారకకు వచ్చాడంటారు. ఆనాడు స్వామిని చూసి భక్తులు ఏ విధంగా పరవశించారో తెలియదు కాని ఈ రోజు భక్తి రసోత్సాహం ఆకాశమంత ఎత్తుగా మనకు కనిపి స్తుంది. 'వస్తున్నాయ్, వస్తు న్నాయ్ జగన్నాథ రథ చక్రాలు' అంటూ జనం స్వామిని తాకడానికి పరుగులు తీస్తారు. జగన్నాథ స్వామి స్వయంగా వీధుల్లోకి వచ్చి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవా ల్లోని ప్రత్యేకత.
మిగతా రోజుల్లో అయితే సాధారణంగా పూజలు నిర్వహించే విగ్రహాలను సామాన్య ప్రజానీకం ముట్టుకోవడానికి అనుమతించరు. స్వామికి ప్రతి ఏటా 24 ఉత్సవాలు జరుగుతాయి.
అన్నిటిలోకి ముఖ్యమైనది ఈ రథ యాత్ర. జగన్నాథుడు సోదర సోదరిలతో కలసి కొత్త రథంలో పూరీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్త ఇంటికి వెళ్లి వస్తాడంటారు. ముఖ్యంగా ఈ రథయాత్రలోనే స్వామిని చూపి తరించాలంటారు.
ఈ రథయాత్ర కోలాహలం భక్త జనులను రంజింప జేస్తుంది. రథచక్రాలను ప్రతి ఏటా కర్రతోనే తయారు చేస్తారు. ఆ విధంగానే 12 ఏళ్లకోసారి
జగన్నాథుని విగ్రహం కూడా చెక్కతోనే తయారవు తుంది. జగన్నాథుని రూపంలో మనకు తల భాగం మాత్రమే కనిపిస్తుంది. నేత్రాలు పెద్దవిగా ఉంటాయి. చేతులు మోచేతి వరకే ఉంటాయి. కాళ్లు ఉండవు. జగన్నాథ స్వామి వారిని గురించిన విశేషాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి.
ఒరిస్సా అడవుల్లోని శబరులు అనే తెగవారు మహావిష్ణువును నీల మాధవునిగా కొలిచేవారు. ఇంద్రద్యుమ్నుడనే మహరాజు పూరీలో ఒక మందిరం నిర్మించి గర్భగుడిలో ప్రతిష్ఠించేదుకు తగిన విగ్రహం కనిపించక వేదన పడుతున్న సమయం లో ఒక రోజు ఆయనకు స్వామి కలలో కనిపించాడు. గిరిజనుల పూజలందుకుంటూ కనిపించి తనకు రాజు కట్టిన ఆలయంలో కూడా పూజలందుకోవాలని ఉందన్నాడు.
అయితే రాజుకు సమస్య ఎదురైంది. నీల మాధవుని విగ్రహాన్ని గిరిజనులు కానివారు దర్శించరాదనే ఆంక్ష ఉంది. ఎలాగైనా ఆ విగ్రహాన్ని తీసుకు రావాలని రాజు, విద్యాపతి అనే అతనిని ఆ పని మీద పంపించారు. అతనికీ నీల మాధవుని దర్శించే అదృష్టం కలగలేదు. మార్గం ఆలోచించిన విద్యాపతి శబరి దొర కుమార్తెను వివాహం చేసుకుని గిరిజనుడయ్యాడు. ఆ తర్వాత అతను నీల మాధవుని దర్శనం చేసుకున్నాడు. తర్వాత జరిగిన విషయాలన్నీ రాజుకు చెప్పి విగ్రహ రూపాన్ని వర్ణించాడు. ఇలా ఉండగా విష్ణుమూర్తి మరోసారి రాజుకు కలలో కనిపించి, నీలాచల్ ప్రాంతం లో ఒక దుంగ కొట్టుకు వస్తుందని, దానిని విగ్రహంలా మలిచి పూజించాలని చెప్పాడు. ఆ విధంగానే ఒక దుంగ దొరికింది. అయితే దానిని విగ్రహంలా మలచే వారెవ్వరూ కనబడలేదు. ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. ఎలాగా అనుకుంటున్న సమ యంలో విష్ణుమూర్తి స్వయంగా అనంత మహారాణా పేరిట వృద్ధ శిల్పిగా వచ్చి 21 రోజుల్లో విగ్రహాన్ని ఏకాంతంగా ఉండి తయారు చేస్తాన న్నాడు. ఆ విధంగానే శిల్పి గుడిలోకి వెళ్లి తలుపులు మూసుకుని విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. చాలా రోజులు గడి చాయి. రాజుగారి భార్యకు శిల్పి లోపల ఏమి చేస్తున్నాడో చూడాల నిపించింది. అది 14వ రోజు. లోపలి నుంచి శబ్దం రావడం లేదు. ముసలి శిల్పి మరణించి ఉంటాడనుకున్న రాణి, రాజు ఎంత చెప్పినా వినక పట్టుపట్టి గుడి తలుపుల్ని తెరిపించింది. లోపలికి వెళ్లి చూశారు. శిల్పి అంతర్ధానం అయ్యాడు. సగం పూర్తయిన శిల్పాలే ఉన్నాయి. చేసేదేమీ లేక అసంపూర్తిగా ఉన్న ఆ శిల్పాలనే ప్రతిష్టించారు.
రథ నిర్మాణం ఎంతో నియమ నిష్ఠలతో ఒక పవిత్ర కార్యంగా జరుగుతుంది. విశ్వకర్మ వంశంవారు 1072 చెక్కలతో 50 రోజుల పాటు దీనిని నిర్మిస్తారు. రథోత్స వానికి ముందు దేవతామూర్తుల్ని గర్భ గుడిలోంచి ప్రాకారంలోని అభిషేక మందిరానికి తరలిస్తారు. సాయంత్రం వరకు ఉంచి చీకటి పడగానే గుడిలోకి చేరుస్తారు. ఆ రోజు నుంచి అమావాస్య వరకూ జగన్నాధుని దర్శనం ఎవరికీ ఉండదన్న మాట. తెరవెనుకే విగ్రహాలు ఉంచి 15 రోజుల పాటు శబరి వంశీయులే నీల మాధ వునిగా స్వామిని ఆరాధిస్తారు. రథయాత్రకు ముందు చందన యాత్ర జరుగుతుంది. అనం తరం మూడు మూర్తులను జల విహారం చేయిస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపిన పన్నీ రుతో స్వామికి స్నానం చేయిస్తారు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే స్వామికి ఇలా అభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో స్వామి ఎదురుగా ఒక అపధాతు అద్దం పెట్టి అందులో కనిపించే ప్రతిబింబానికి స్నానం చేయి స్తారు. 108 బిందెల పన్నీరుతో స్వామికి స్నానం ఉంటుంది. స్నానం తర్వాత శైత్యం వల్ల జలుబు చేసిందని 15 రోజుల పాటు స్వామిని ఎవరికీ కనబడనీయరు. రథయాత్ర రోజున స్వామి, సోదరి, సోదరుడితో కలిసి ఆలయం విడిచివచ్చి రథాన్ని ఎక్కి దర్శన మిస్తారు. శబరవంశీ యులేస్వామిని రథం వద్దకు మోసుకెళతారు.
జగన్నాధుని రథం పేరు *నందిఘోష* ,
బలభద్రుని రథం పేరు *తాళ ధ్వజ*
సుభద్ర రథం పేరు *దర్భ దాళ.* జగన్నాథుని రథాన్ని పసుపు, ఎరుపు రంగులూ, తాళ ధ్వజకు ఎరుపు, ఆకుపచ్చరంగులూ, దర్శ దాళకు ఎరుపు, నలుపు రంగులూ వాడతారు.
విగ్రహాలను రథాల వద్దకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని *'పహండి'* అంటారు. వేద మంత్రాలూ, మంగళవాయిద్యాల మధ్య ఈ జగన్నాథ రథోత్సవం సాగుతుంది. రథం గుండిచ మందిరం చేరిన తర్వాత స్వామి అక్కడ వేసవి విడిది చేస్తారు. వారం రోజుల పాటు పూల తోటల మధ్య స్వామి సేద తీరుతారు. ఒక్కో రోజు ఒక్కో రకంగా స్వామికి అలంకారాలు చేస్తారు. దశమి వరకూ స్వామి గుండిచా మందిరంలోనే ఉండి సాయంత్రానికి పూరి తిరిగి వస్తారు. అత్యంత మనోహరంగా, కోలాహలంగా, ఆనంద దాయకంగా సాగే జగన్నాథ స్వామి రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. అప్పుడే జన్మ ధన్యత చెందుతుంది.
*జగన్నాథ స్వామీ నయన పథగామి*
*భవతుమే భవతుమే శరణం మమ*
అనుకుంటూ భక్తులు స్వామికి నైవేద్యాన్ని మట్టి కుండల్లో తెచ్చి సమర్పిస్తారు. అందరూ తినే అన్నమే స్వామికి నైవేద్యం. ఇది కాకస్వామికి సామాన్య మానవుడి లాగానే ఉదయం ఉపాహారం, వివిధ రకాల పదార్థాలనూ నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే స్వామికి పళ్లు తోమడం, స్నానం చేయించడం, భోజనం పెట్టడం, భార్యాభర్తల తగాదాలూ, అనారోగ్యం, ఉపవాసం వంటివి వివిధ ఉత్సవాల రూపంలో మనకు కనిపిస్తాయి. సర్వం జగన్నాథమయం అనుకుంటూ భక్తులు పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ఆ పర మాత్మను నిష్కల్మషమైన మనస్సుతో కొలిచి జీవన్ముక్తికి మార్గాలు వేసుకుంటారు.
🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺
No comments:
Post a Comment