Sunday, July 13, 2025

 *🙏🕉️🛕భగవన్నామము సకల దుఃఖనివారిణి!!!* 

*ఎట్టి ఉపాయమూ తోచని స్థితిలో మనసు నిండుగా భగవంతుని తలచి చూడండి, ఏదో ఒక రూపంలో పరిష్కారము అనుగ్రహించడం తప్పక అనుభవంలోకి వస్తుంది.* 

*ఇంకా వేకువనే లేచి భగవంతుని స్మరించుట వలన ఆ దినమంతయూ శుభమే జరుగుతుంది.* 

*సాధన చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద ఫలితాన్నే ఇస్తుంది.* 

*పెద్ద అరణ్యములో త్రోవ చూపుటకు చిన్న దీపం చాలు కదా!* 

*అలాగే మన జీవితానికి సరైన త్రోవ చూపుటకు భగవన్నామ స్మరణ అనే చిన్న సాధన చాలును.* 

*దీనికి తోడు సేవ అనేది మనము ప్రయాణించిన త్రోవను శుభ్రం చేయుటకు సహకరిస్తుంది.* 

*కలియుగములో మానవజన్మ సార్ధకతకు, మోక్ష సాధనకు అతి సులువైన మార్గం ' భగవన్నామస్మరణ- దీన జనసేవ ' యే. నేటి పరిస్థితుల్లో వీటికి మించి సులువైన ఉపాయం మరొకటి లేనేలేదని చెప్పాలి.*

 🙏 *సమస్త లోకా:  సుఖినోభవన్తు.*

No comments:

Post a Comment