సాష్టాంగ నమస్కారం
స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.
అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా !
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!
బావము
అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం - పాదములు, కరాభ్యాం - చేతులు, కర్నాభ్యాం - చెవులు.
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నేలకు తాకాలి.
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు.
No comments:
Post a Comment